నిర్ణయాన్ని మార్చుకున్న రవితేజ… దర్శకుడు త్రినాథ్ రావుకే మొదటి ఛాన్స్..!

‘వెంకీ’ ‘దుబాయ్ శీను’ ‘కిక్’ సినిమాల స్టైల్లో.. రవితేజ ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులైంది. ప్రేక్షకులు కూడా రవితేజను అంత ఎనర్జిటిక్ గా చూడాలని ఆశపడుతున్నారు. గత 3 ఏళ్ళలో ఒక్క ‘రాజా ది గ్రేట్’ చిత్రం తప్ప.. మరో ఎంటర్టైన్మెంట్ సినిమా చెయ్యలేదు మన మాస్ మహారాజ్..! ఇప్పుడు రవితేజ చేస్తున్న ‘క్రాక్’ లో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో.. మాస్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కానీ..

కామెడీ మాత్రం ఆశించిన విధంగా ఉండదనే టాక్ వినిపిస్తుంది. దాంతో రవితేజ కూడా ఓ ఎంటర్టైన్మెంట్ సినిమా చెయ్యాలని భావిస్తున్నాడట.అందుకే ‘క్రాక్’ పూర్తైన వెంటనే త్రినాథ్ రావ్ నక్కినతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. నిజానికి ‘క్రాక్’ పూర్తయ్యాక .. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు రవితేజ. కానీ ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యేలా ఉందట. అందుకోసం త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో సినిమాని మొదట సెట్స్ పైకి తీసుకువెళ్లాలని రవితేజ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

ఇప్పటి వరకూ త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో వచ్చిన అన్ని సినిమాలు హిట్లే..! పైగా అతని సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కూడా ఉంటుంది. కాబట్టి రవితేజ తీసుకున్న డెసిషన్ మంచిదేనని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..!

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus