Ravi Teja: బయ్యర్ల విషయంలో మంచి మనస్సు చాటుకున్న రవితేజ.. ఏమైందంటే?

మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో రావణాసుర మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఈ సినిమా అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. కథ ఎంపికలో రవితేజ పొరపాట్లు చేశాడని అందువల్లే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే రావణాసుర బయ్యర్ల కోసం రవితేజ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రావణాసుర బయ్యర్లలో ఎవరికి ఎంత నష్టాలు వచ్చాయో తెలుసుకుని రవితేజ సెటిల్ చేశారని సమాచారం.

రవితేజ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసి నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. ఇతర హీరోలు కూడా తమ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోని పక్షంలో ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పవచ్చు. బయ్యర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు, హీరోలు వ్యవహరిస్తే మంచిది. గత కొన్నేళ్లలో సినిమాల బడ్జెట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. హీరోల పారితోషికాలు భారీగా పెరగడం వల్లే సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయని నిర్మాతలు చెబుతున్నారు.

అయితే హీరోల పారితోషికాలు పెరుగుతున్న స్థాయిలో సినిమాల కలెక్షన్లు పెరగడం లేదు. మరీ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను మినహా సాధారణ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. రవితేజ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా నిర్మాతలు నష్టపోతే గతంలో కూడా రవితేజ భారీ మొత్తంలో సహాయం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. పలు సందర్భాల్లో రవితేజ ఈ విషయాలను వెల్లడించడం జరిగింది.

రవితేజ (Ravi Teja) కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ బయ్యర్లకు ఎంత మొత్తం వెనక్కిచ్చారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. రవితేజ కొత్త సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus