Ravi Teja: అభిమానుల ఇంటికి వెళ్లి షాకిచ్చిన మాస్ మహారాజ్.. గ్రేట్ అంటూ?

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇతర సినిమాలకు భిన్నంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే తాజాగా రవితేజ చేసిన ఒక పని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. 70 ఏళ్ల బామ్మల కోసం రవితేజ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కారంపూడిలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ షూట్ జరుగుతుండగా 70 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు బామ్మలు రవితేజను కలవాలని ఈ సినిమా సెట్స్ దగ్గరకు వచ్చారట. అదే సమయంలో రవితేజ బిజీగా ఉండటంతో వాళ్లను కలవలేదు.

అయితే షాట్ పూర్తైన తర్వాత తన కోసం ముగ్గురు అభిమానులు వచ్చారని తెలుసుకున్న రవితేజ షూటింగ్ తర్వాత వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. రవితేజ వెళ్లిన సమయంలో వాళ్లు భోజనం చేస్తూ ఉండటంతో కొంత సమయం పాటు మాస్ మహారాజ్ వేచి చూశారని సమాచారం అందుతోంది. మాస్ మహారాజ్ అభిమానుల విషయంలో ఇంత ప్రేమగా వ్యవహరిస్తారు కాబట్టే ఆయనకు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

రవితేజ (Ravi Teja) పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. మాస్ మహారాజ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రవితేజ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని పాన్ ఇండియా రేంజ్ లో హిట్లను సొంతం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus