Ravi Teja: మాస్ మహారాజ్ పారితోషికం ఆ రేంజ్ లో ఉందా.. ఏమైందంటే?

మాస్ మహారాజ్ రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయం సాధించినా ఆ సినిమాలకు ముందు, ఆ సినిమాల తర్వాత ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ హీరో రవితేజకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల చొప్పున నాలుగు సినిమాలకు ఈ మొత్తాన్ని రవితేజ పారితోషికంగా అందుకుంటున్నారని తెలుస్తోంది. మాస్ మహారాజ్ పారితోషికం ఆ రేంజ్ లో ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ లకు డైరెక్టర్లు ఫైనల్ కావాల్సి ఉంది. మాస్ మహారాజ్ రవితేజ ఇప్పటికే పలు సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేసినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మాస్ మహారాజ్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రవితేజ సినిమా సినిమాకు భిన్నమైన లుక్ లో కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

రవితేజకు పీపుల్స్ మీడియా బ్యానర్ లక్కీ బ్యానర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా రవితేజ నటించిన ఈగిల్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. కార్తీక్ ఘట్టమనేని కెరీర్ కు ఈ సినిమా కీలకం కనుంది.

రవితేజ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. రవితేజ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తోంది. రవితేజ వయస్సు పెరుగుతున్నా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. (Ravi Teja) రవితేజకు 2024 సంవత్సరం కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus