Ravi Teja: నా బయోపిక్ లో ఆ హీరో అయితే బాగుంటుంది!

  • October 15, 2023 / 12:13 PM IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రవితేజ సినీ కెరియర్లో ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ చేశారు.

రవితేజ ఎక్కువగా బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ అక్కడ మీడియా సమావేశాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రవితేజకు తన బయోపిక్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఫ్యూచర్లో ఒకవేళ మీ బయోపిక్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అంటూ రవితేజను ప్రశ్నించడంతో ఆయన చాలా ఎంటర్టైనర్ గా తన బయోపిక్ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని వెల్లడించారు. అయితే మీ బయోపిక్ సినిమాలో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ నా బయోపిక్ సినిమాలో మరే హీరో కాకుండా నేనే నటిస్తే చాలా బాగుంటుందని ఈయన తెలియజేశారు. మరి మీ బయోపిక్ సినిమాకు ఏ టైటిల్ మీరు పెట్టబోతున్నారు అంటూ రవితేజను ప్రశ్నించడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గట్టిగా మాస్ మహారాజా అని కేకలు వేశారు. నా సినిమాకు మాస్ మహారాజా అనే టైటిల్ మాత్రమే పెడతాను అంటూ సమాధానం చెప్పారు. రవితేజ బయోపిక్ సినిమా గురించి ఇలాంటి కామెంట్ చేయడంతో ఈయన తప్పకుండా తన బయోపిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారని భావిస్తున్నారు.

ఇక రవితేజ (Ravi Teja) ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కెరీర్ మొదట్లో ఈయన జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ ఈయన సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా సినిమా అవకాశాలను అందుకున్నటువంటి రవితేజ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus