సంక్రాంతికి పుచ్చె పగిలిపోద్ది అంటున్న మాస్ రాజా.!

మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రాక్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న హ్యట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు, పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో రవితేజ మరోసారి విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తూ రెచ్చిపోవడం అనేది కిక్ ఇస్తోంది. ఇక ట్రైలర్ చూస్తుంటే మాస్ రాజా సంక్రాంతికి రెచ్చిపోయేలాగానే కనిపిస్తున్నాడు. ‘శంకర్ పోతరాజు వీర శంకర్’ అంటూ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పాలి.

ష్యూర్ షాట్ .. నో డౌట్.. పుచ్చె పగిలిపోద్ది అంటూ మాస్ డైలాగ్స్ తో రవితేజ రెచ్చిపోయాడు. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో విక్టరీ వెంకటేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ కి మస్త్ మజాని ఇచ్చింది. జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకి ఉండాల్సిన మేకు ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాటతీశాయ్.. ఆ తాట తీసింది ఎవరో కాదు.. మిస్టర్ పోలీస్ అంటూ రవితేజకి ఇచ్చిన బిల్డప్ వాయిస్ ఆకట్టుకుంటుంది.

ఇక ప్రధాన విలన్స్ గా సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లు కనిపిస్తున్నారు. హీరోకి – విలన్స్ కి మద్యలో వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నాయంటూ ట్రైలర్ లో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. కొండారెడ్డి బురుజు సెంటర్లో ప్రత్యేక రాయలసీమ్ ఉద్యమం చేస్తున్నట్లుగా కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ గా యాక్షన్ సీన్స్ చేస్తూనే, హీరోయిన్ శృతిహాసన్ తో రొమాన్స్ చేస్తున్నాడు మాస్ రాజా. ఒకవైపు వైలన్స్, మరోవైపు రొమాన్స్ ట్రైలర్ లో రెండూ బాగా డీల్ చేశాడు.

ఇక కాసేపు ఆగితే నా మూడ్ ఎలా ఉంటుందో, ఏది కట్ చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు రవితేజ. ఓవర్ ఆల్ గా ట్రైలర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి పవర్ ప్యాక్ యాక్షన్ తో సూపర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus