Ravi Teja, Balakrishna: బాలయ్య సినిమా వల్ల రవితేజ ఫ్లాప్ సినిమాకి కలిసొచ్చింది.. ఎలా అంటే..!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి..అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా చేసిన రవితేజ .. పూరి జగన్నాథ్ వల్ల స్టార్ హీరోగా ఎదిగాడు. రవితేజ కెరీర్ గురించి చెప్పాలి అంటే ‘ఇడియట్’ కి ముందు ‘ఇడియట్’ కి తర్వాత అని చెప్పాలి. ఆ తర్వాత రవితేజ నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు కావడం కూడా అతనికి ప్లస్ అయ్యింది. త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోబోతున్నాం.

సెంటిమెంట్ ప్రకారం రవితేజ సినిమా , బాలకృష్ణ సినిమా పక్క పక్కనే వస్తే.. రవితేజ సినిమా హిట్ కొట్టడం మనం చాలా సందర్భాల్లో చూశాం. అయితే రవితేజ సినిమాల్లో కంటెంట్ కూడా బలంగా ఉండటం అనేది కూడా బాలయ్య సినిమాలకి పోటీగా నిలబడటానికి కారణమైంది. అయితే రవితేజ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా.. బాలయ్య ప్లాప్ సినిమా వల్ల గట్టెక్కిన సందర్భాలు ఉన్నాయి. అదెప్పుడు జరిగింది అంటే.. మనం 2005 కి వెళ్ళాలి.

ఆ ఏడాది దసరా కానుకగా (Balakrishna) బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ సినిమా రిలీజ్ అయ్యింది. జయంత్ సి పరాన్జీ దర్శకుడు. ‘లక్ష్మీ నరసింహ’ కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. కానీ సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఆ తర్వాత కొద్దిరోజులకి రవితేజ నటించిన ‘భగీరథ’ రిలీజ్ అయ్యింది.

దీనికి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాలయ్య ‘అల్లరి పిడుగు’ కంటే బెటర్ గా ఉంది అనే టాక్ ఈ సినిమాకి హెల్ప్ అయ్యింది. దీంతో కమర్షియల్ గా సేఫ్ అయిపోయింది. అలా అని ఇది ఎంటర్టైన్ చేసే సినిమా అని చెప్పలేము.’ఒకరికి ఒకరు’ ఫేమ్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘భగీరథ’ వల్ల ఇతనికి ఎక్కువ అవకాశాలు వచ్చింది కూడా లేదు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus