వరుసగా నాలుగోసారి 10 లోపే అవుట్..!

  • February 3, 2020 / 07:24 PM IST

వరుసగా మూడు డిజాస్టర్ లు పడ్డాయి.. ఈసారైనా హిట్ పడితే అంతే చాలు అనుకున్న రవితేజ అభిమానులకి ఈసారి కూడా పెద్ద దెబ్బే పడింది. జనవరి 24న విడుదలైన రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ అయ్యేలానే ఉంది. డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించినప్పటికీ.. ఈ చిత్రం వీక్ డేస్ లో ఘోరంగా చతికిలపడిపోయింది. కనీసం ఇప్పటివరకూ 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి 22కోట్ల బిజినెస్ జరిగింది. డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ పుణ్యమాని నిర్మాత సేఫ్ అయిపోయాడు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేవు.

ఈ ఎఫెక్ట్ రవితేజ నెక్స్ట్ సినిమా బడ్జెట్ పై కూడా పడిందని సమాచారం. వీలైనంత తక్కువలో ఆ రవితేజ తన తర్వాతి చిత్రాన్ని రూపొందించాలని డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే.. డిస్కో రాజా చిత్రాన్ని కొన్ని ఏరియాల్లో తీసేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ లు అయిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్ని వేస్తున్నారట. ఇప్పటికీ ఆ చిత్రాలకి ఆదరణ బాగుండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ సినిమా హిట్ అయ్యి.. ఆ చిత్రాల రన్ కి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే.. ఇలా సీన్ రెవర్స్ అయ్యిందేంటి అని ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నట్టు తెలుస్తుంది. మరి ‘క్రాక్’ చిత్రంతో అయినా హిట్టు కొట్టి.. రవితేజ తన అభిమానుల్ని సంతృప్తిపరుస్తాడేమో చూడాలి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus