మాస్ మహారాజ్ రవితేజ మూడు వారాల గ్యాప్ లో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడంతో పాటు రవితేజ మార్కెట్ ను పెంచాయి. అయితే రవితేజ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. పోలీస్ రోల్స్ మాస్ మహారాజ్ కు అచ్చొచ్చాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవికి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిందో రవితేజకు కూడా అదే స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రకు రవితేజ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించారు. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
మిరపకాయ్, పవర్, క్రాక్ సినిమాలలో కూడా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించగా ఈ సినిమాలు కూడా రవితేజకు కమర్షియల్ గా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. ఏ పాత్రలో నటించినా రవితేజ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారు. రవితేజ స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.
వరుస సక్సెస్ లతో రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. రవితేజ సరైన కథలను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకునే ఛాన్స్ అయితే ఉంది. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో రవితేజ నటిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?