Ravi Teja: కొత్త కారు కొనుగోలు చేసిన రవితేజ.. ధర ఎంతో తెలుసా?

చిరంజీవి, రవితేజ అనగానే మనకి వాల్తేరు వీరయ్య సినిమా గుర్తుకొస్తుంది . ఆ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇద్దరినీ కలిపి స్క్రీన్ పై చూస్తుంటే అభిమానులకు కన్నుల పండుగలా అనిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనవరి 13 న రిలీజ్ అయిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో 100 రోజులు పూర్తిచేసుకోబోతోంది. 11 సెంటర్స్ లో ఈ మూవీ 100 రోజులు ప్రదర్శించబడుతుంది అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు టైటిల్ లో చిరంజీవి, (Ravi Teja) రవితేజ అని పెట్టింది ఈ సినిమా గురించి కాదు. విషయం ఏంటి అంటే.. ఇటీవల చిరంజీవి కొత్త కారుని కొనుగోలు చేసి ఖైరతాబాద్ ఆర్. టి. ఎ ఆఫీస్ లో ఫ్యాన్సీ నంబర్ కొనుగోలు చేసుకుని రిజిస్టర్ చేయించుకున్నారు.సరిగ్గా ఇప్పుడు రవితేజ కూడా అలానే కొత్త కారు కొనుగోలు చేశారు.రవితేజ BYD ATTO 3 EV బ్యాటరీ వెహికిల్ ను కొనుగోలు చేయడం జరిగింది.

దీని ధర రూ.34,49,000 కావడం విశేషం. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం రవితేజ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి TS09GB2628 నంబర్ ను వేలంలో రూ.17,628 రేటు పెట్టి దక్కించుకున్నట్టు.. తెలుస్తుంది. ఒకప్పుడు రవితేజ జూబ్లీ చెక్ పోస్ట్ నుండీ కృష్ణానగర్ వరకు బైక్ ఇంజిన్ ఆపేసి మరీ వెళ్ళేవాడు.

అది మొత్తం పల్లం కాబట్టి పెట్రోల్ కలిసొస్తుంది అని అలా చేసేవాడినని ..ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు లక్షలు పెట్టి కార్లు, వేలకు వేలు పెట్టి రిజిస్ట్రేషన్ లు చేయించుకునే స్థాయికి అతను ఎదిగాడు.l

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus