ఫ్యాన్స్ కు షాకిచ్చిన రవితేజ కామెంట్స్..!

కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అలాగే నెగిటివ్ రోల్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తుండేవాడు రవితేజ. తరువాత పూరి జగన్నాధ్ చేతిలో పడి ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. మినిమం గ్యారంటీ హీరో అనే నమ్మకాన్ని కూడా సంపాదించాడు. కానీ ఈమధ్య కాలంలో ఆయన్ని ఎక్కువగా ప్లాప్ లు వెంటాడుతూ వచ్చాయి. కుర్ర హీరోల దాటికి రవితేజ తడబడుతున్నట్టే కనిపిస్తున్నాడు.ఇక రవితేజ నటించిన తాజా చిత్రం ‘డిస్కో రాజా’. జనవరి 24 న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా రవితేజ మాట్లాడుతూ మళ్ళీ విలన్ గా నటించడానికి కూడా రెడీ అంటున్నాడు.

పాత్ర ఏదైనా తనదైన మేనరిజమ్స్ తో ప్రేక్షకులను హుషారెత్తించడం రవితేజ ప్రత్యేకత. అలాంటి రవితేజ తాజా చిత్రంగా రూపొందిన ‘డిస్కోరాజా’ ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.తాజా ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ .. “గతంలో నేను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది.హీరోయిన్లు, దర్శకుడు వీఐ ఆనంద్ టేకింగ్ .. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఉంటాయి. కాన్సెప్ట్ లోను .. పాత్రల్లోను కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసం విలన్ గా కనిపించడానికి కూడా నేను సిద్ధమే. అయితే ఆ విలనిజం కొత్తగా ఉండాలి .. విభిన్నంగా ఉండాలి. అలాంటి విలన్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను” అంటూ చెప్పాడు. అయితే రవితేజ అభిమానులు మాత్రం ఈయన్ని విలన్ గా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus