Ravi Teja: మంచి సినిమాని మిస్ చేసుకున్న మాస్ మహారాజ్..!

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ చిత్రంతో మంచి హిట్ అందుకుని కం బ్యాక్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అది కూడా 50 శాతం సీటింగ్ కెపాసిటీ తోనే కావడం విశేషం. ఇది పక్కన పెడితే.. రవితేజ 2 ఏళ్ళ క్రితం వచ్చిన ఓ సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసాడట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం వలన తమిళ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడట.

వివరాల్లోకి వెళితే.. 2018వ సంవత్సరం అక్టోబర్ 17న విడుదలైన ‘వడా చెన్నై’ (తమిళ్) చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో ఆమీర్ సుల్తాన్ పోషించిన రాజన్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాత్రకు మొదట మన రవితేజను సంప్రదించాడట దర్శకుడు వెట్రిమారన్. కానీ అతను ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు దర్శకుడు ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ.. ” ‘వడా చెన్నై’ లో హీరో ధనుష్ పాత్ర తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఏదైనా ఉందా అంటే కచ్చితంగా అది స్మగ్లర్ రాజన్ పాత్ర అనే చెప్పాలి.

నిజానికి ఈ పాత్ర కోసం మొదట విజయ్ సేతుపతిని అనుకున్నాను. డేట్స్ ఖాళీ లేక అతను చెయ్యలేనని చెప్పాడు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రవితేజను కూడా సంప్రదించాను. అతను కూడా ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోతాడు. అందుకే రవితేజని కలిసి ఈ కథ వినిపించాను..అతనికి ఈ కథ నచ్చింది. కానీ ఆ టైములో రవితేజ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో ‘వడా చెన్నై’ ను వదులుకున్నాడు” అంటూ వెట్రిమారన్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus