Mr Bachchan Showreel: ‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ లో.. దీనిని గమనించారా?

  • June 18, 2024 / 02:58 PM IST

రవితేజ ఈ మధ్య ఎక్కువగా సీరియస్ డ్రామాతో కూడిన సినిమాలు చేస్తున్నారు. ‘డిస్కో రాజా’ (Disco Raja) నుండి చూసుకుంటే ‘క్రాక్’ (Krack)  ‘ధమాకా’ (Dhamaka) తప్ప మిగిలినవన్నీ సీరియస్ మూవీస్ అనే చెప్పాలి. సో రవితేజ బలం మాస్ అని దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మధ్య రవితేజ (Ravi Teja) సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోతున్నాయి. అది గమనించే అనుకుంట.. హరీష్ శంకర్ తో (Harish Shankar) సినిమా సెట్ చేసుకున్నాడు. హరీష్- రవితేజ కాంబినేషన్లో ‘షాక్’ (Shock) ‘మిరపకాయ్’ (Mirapakay) వంటి సినిమాలు వచ్చాయి.

‘షాక్’ ఆడలేదు.. ‘మిరపకాయ్’ బాగా ఆడింది. అందుకే వీరి కాంబినేషన్లో రూపొందే మూడో సినిమా.. కమర్షియల్ జోనర్లోనే ఎంపిక చేసుకున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. బాలీవుడ్లో రూపొందిన ‘రైడ్’ చిత్రానికి రీమేక్ ఇది. రీమేక్ చిత్రాలు తీయడంలో హరీష్ స్పెషలిస్ట్. ఎందుకంటే.. కథనం యాజ్ ఇట్ ఈజ్ గా ఉండదు. అతని స్టైల్ కి తగ్గట్టు.. హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు బాగా ఇంప్రొవైజ్ చేస్తుంటాడు.

తాజాగా రిలీజ్ అయిన ‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ తో.. మరోసారి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాడు హరీష్. ఇన్కమ్ టాక్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా రవితేజ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. విలన్ గా జగపతిబాబు (Jagapathi Babu) నటిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఆ షో రీల్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus