Ravi Teja: అభిమాన నటి ఎవరు? రవితేజ ఆన్సర్‌ అదిరిపోయిందిగా!

రవితేజ సినిమాలో ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో… బయట కూడా అంతే ఉంటాడు. సినిమల్లో ఎలా అయితే ఎటకారంతో, వన్‌ లైనర్లతో ఆకట్టుకుంటాడో, బయట కూడా అంతే జోవియల్‌గా ఉంటాడు. అదే ఫ్యాన్స్‌ మధ్యలోకి వస్తే ఇంకా హుషారు అయిపోతాడు. తాజాగా మరోసారి ఇదే పని చేశాడు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా ప్రచారం గురించి రవితేజ ఇటీవల తన అభిమానుల్ని కలిశాడు. ఈ క్రమంలో వాళ్ల ప్రశ్నలకు రవితేజ భలే సమాధానాలు ఇచ్చి మెప్పించాడు.

రవితేజ (Ravi Teja) హీరోగా వంశీ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురంలో ఒకప్పుడు గజదొంగగా పేరు మోసిన టైగర్‌ నాగేశ్వరరావుకు ఇప్పటివరకు వచ్చిన పుకార్లు, కథలను బేస్‌ చేసుకుని రూపొందిన సినిమా ఇది. విజయదశమి సందర్భంగా ఈ సినిమా అక్టోబరు 20న వస్తోంది. ఆ సినిమా గురించి ఓ అభిమాని ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో గూస్‌ బంప్స్‌ సీన్స్‌ ఉన్నాయా? అని అడిగితే… టీజర్‌, ట్రైలర్ చూసే ఉంటావ్‌ కదా నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు రవితేజ.

మరి ఫ్యూచర్‌లోనూ ఇలాంటి పాత్రలు చేస్తారా? అని అడిగితే… భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. ప్రజెంట్‌పైనే నా దృష్టంతా అని చెప్పి తన తత్వం మరోసారి అర్థమయ్యేలా చేశాడు మాస్‌ మహరాజా. ఇక ప్రజెంట్‌ ట్రెండ్‌ అయిన సినిమాటిక్‌ యూనివర్స్‌ చేస్తారా? అని అడిగితే.. కథ బాగుంటే తప్పకుండా చేస్తా అని క్లారిటీ ఇచ్చాడు. ‘షాక్‌’ సినిమా లాంటి ఎమోషనల్‌ సినిమాలో మళ్లీ మిమ్మల్ని చూడొచ్చా అంటే… చూద్దాం ఎప్పుడు జరుగుతుందో అని అన్నాడు.

మీ అభిమాన నటి ఎవరు అని అడిగితే… ఆడవాళ్లంతా నా ఫేవరెట్‌ అంటూ భలే సమాధానం ఇచ్చాడు రవితేజ. అసలు మీరు ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారు అని సీక్రెట్ అడిగితే… ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటాను.. అదే నాలో ఎనర్జీని తీసుకొస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించేవారు ఎనర్జిటిక్‌గా ఉండలేరు అని టిప్‌ చెప్పాడు. ఫైనల్‌గా మీ ఫస్ట్‌ పాన్‌ ఇండియా సినమా కదా అని అడిగితే… పాన్‌ ఇండియా అని వేరుగా అనొద్దు. ఇండియన్‌ ఫిల్మ్‌ అనండి చాలు అంటూ తన ఆలోచన చెప్పేశాడు రవితేజ.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus