Ravi Teja: రవితేజలో ఈ మార్పు చూశారా..?

టాలీవుడ్ లో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రవితేజ. ఆయన సినిమాలకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ‘క్రాక్’ హిట్ తరువాత రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా.. ప్రమోషన్స్ మాత్రం పెద్దగా యాక్టివ్ గా కనిపించరు రవితేజ. ఆడియో ఫంక్షన్స్ లో, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో రవితేజ పెద్దగా మాట్లాడరు. ఇంటర్వ్యూలలో అయితే అన్నీ వన్ వర్డ్ ఆన్సర్స్. ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా రవితేజ పెద్దగా కనిపించడు.

అయితే తన కొత్త సినిమా ‘ధమాకా’ విషయంలో మాత్రం రవితేజ తన పద్ధతి మార్చుకున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల ముందు నుంచి ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు రవితేజ. ఇటీవల ‘ఢీ’ షోకి అతిథిగా వెళ్లారు రవితేజ. ట్విట్టర్ లో అభిమానులతో చాట్ చేశారు రవితేజ. చాలా యాక్టివ్ గా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అలానే అభిమానులతో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రవితేజ అభిమానులు ఈ మీట్ లో పాల్గొంటున్నారు.

రవితేజ ఫ్యాన్ మీట్ పెట్టడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. అంతేకాదు.. బిగ్ బాస్ షోలో కూడా రవితేజ కనిపించబోతున్నారు. ఇదంతా తన కొత్త సినిమా ‘ధమాకా’ ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ప్రీరిలీజ్ ఫంక్షన్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్స్ విషయంలో ప్రమోషన్స్ ఎంత హెల్ప్ చేస్తాయనేది రవితేజ అర్ధం చేసుకున్నారు. అందుకే ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో నిర్మాతలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus