మామూలుగా అయితే హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. కానీ మన హీరోలే థియేటర్లు కొనేయడం, కొత్త కట్టేయడం లాంటివి చేస్తుండటం వల్ల వాళ్ల సినిమాలు వాళ్ల థియేటర్లలోనే రిలీజ్ అవుతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే మహేష్ (Mahesh Babu) నటించిన సినిమా మహేష్‌కి చెంది ‘ఏఎంబీ’లో… అల్లు అర్జున్ (Allu Arjun) యాక్ట్ చేసిన సినిమా ‘ఏఏఏ’లో రిలీజ్ అవుతున్నాయి. విజయ్ దేవకొండ (Vijay Devarakonda) సినిమా ‘ఏవీడీ’లో వచ్చినట్లు… త్వరలో రవితేజ (Ravi Teja) నటించే సినిమా ‘ఏఆర్‌టీ’లో రిలీజ్ అవుతుంది.
గత కొంత కాలంగా రవితేజ కూడా థియేటర్ల వ్యాపారంలోకి వస్తాడు అని వార్తలొస్తున్నాయి. నగరం ప్రారంభంలోనే ఓ థియేటర్ కడుతున్నాడు అంటూ వార్తలొచ్చాయి. దీనికి దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో ఓ పాత థియేటర్ తీసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. రవితేజ కొత్త థియేటర్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే అది దిల్‌సుఖ్ నగర్‌లో కాదు వనస్థలిపురంలోనే. ఈ మేరకు కొన్ని ఫొటోలు ఏషియన్ టీమ్ రిలీజ్ చేసింది.
హీరోలు తమ పేర్ల మీద మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేసుకోవడం గత కొన్ని ఏళ్లుగా సాగుతోంది. వాటిలో చాలావరకు ఏషియన్ సినిమాస్ వాళ్లే చేస్తున్నారు. ఆ హీరోతో టై అప్ అయి థియేటర్లను నిర్మిస్తున్నారు. భాగస్వామి ఆ థియేటర్లను రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏసియన్ రవితేజ (ఏఆర్‌టీ) పేరుతో వనస్థలిపురం / పనామాలో థియేటర్ నిర్మిస్తున్న ఈ థియేటర్ పనులు పూజతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో సరైన మల్టీప్లెక్స్ లేదు అనే మాట గత కొన్నేళ్లుగా వినిపించేది ఇప్పుడు ఏఆర్‌టీతో అది తీరబోతోంది అన్నమాట.
మరోవైపు సుదర్శన్ థియేటర్‌ను ఏఎంబీ విక్టరీ అని కడుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ థియేటర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి అని తెలుస్తోంది. దీనిపై కూడా టీమ్ త్వరలో క్లారిటీ వస్తుందని సమాచారం. అంతేకాదు మరికొంతమంది స్టార్ హీరోలు ఇదే పనిలో ఉన్నారని సమాచారం. వీళ్లందరూ ఏసియన్ సినిమాస్‌తో కలిసే థియేటర్ల ప్రయాణం చేస్తారు అని చెబుతున్నారు.