Ravi Teja: మాస్ మహారాజ్ – మాస్ క దాస్ కాంబో అలా ఫిక్స్ అయ్యింది

ఈ ఏడాది చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటించాడు రవితేజ. ఆ సినిమాకి కంప్లీట్ మల్టీస్టారర్ అప్పీల్ వచ్చింది అంటే అది రవితేజ వల్లే అని చెప్పాలి…! పైగా చిరంజీవికి రవితేజ తమ్ముడిగా కనిపించడం మెగా అభిమానులకు కూడా బాగా నచ్చింది.ఇక తర్వాత రవితేజ నుండి వచ్చిన ‘రావణాసుర’ అంతగా మెప్పించలేదు. అయితే అందులో కూడా సుశాంత్ తో కలిసి నటించాడు రవితేజ. ఇదిలా ఉండగా.. త్వరలో రవితేజ ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇందులో రవితేజతో (Ravi Teja) పాటు శర్వానంద్ కూడా హీరోగా నటిస్తాడు అని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో.. ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుండి శర్వానంద్ తప్పుకున్నాడు. అతని ప్లేస్ లో మాస్ క దాస్ విశ్వక్ సేన్ ను ఫైనల్ చేశాడు దర్శకుడు సందీప్ రాజ్. ‘ముఖ చిత్రం’ టైంలో విశ్వక్ సేన్ తో సందీప్ కి మంచి సాన్నిహిత్యం కుదిరింది. ఆ సినిమాలో విశ్వక్ సేన్ .. లాయర్ పాత్రలో కనిపించాడు.

‘ముఖ చిత్రం’ సినిమాకి సందీప్ రాజ్.. నిర్మాతగా వ్యవహరించాడు.ఆ విధంగా మాస్ మహారాజ్ – మాస్ క దాస్ ల కాంబోని సెట్ చేశాడు సందీప్ రాజ్. ఇది అతనికి పెద్ద ప్రాజెక్టు కానుంది. ఇక కథ ప్రకారం.. ఈ చిత్రంలో రవితేజ- విశ్వక్ సేన్.. లు గురుశిష్యులుగా కనిపిస్తారని.. వీళ్ళ కాంబినేషన్లో డిజైన్ చేసిన సన్నివేశాలు బాగుంటాయని తెలుస్తుంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus