Ravi Teja: హైపర్ ఆదిని ఓ రేంజ్లో ఆడేసుకున్న రవితేజ.. స్టేజి పైనే వార్ణింగ్..!

మాస్ మహారాజ్ రవితేజ.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్లాప్ బాయ్ గా, లైట్ మెన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా ఎంతో కష్టపడి పని చేసి ఈరోజు స్టార్ హీరోగా మన ముందు నిలబడ్డాడు. సెల్ఫ్ మేడ్ స్టార్ అనిపించుకున్నాడు. రవితేజ చాలా వరకు కాంట్రావర్సీలకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంటాడు. కానీ కాంట్రవర్సీలు ఒకోసారి అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. గతంలో డ్రగ్స్ కేసులో ఇతన్ని ఈడి విచారించిన సంగతి తెలిసిందే.

అంతకంటే ముందు ఓ స్టార్ హీరో రవితేజని ఇంటికి పిలిచి మరీ కొట్టినట్టు కథనాలు వినిపించాయి. అయితే అది అబద్దమని ఓ టాక్ షోలో ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. రవితేజ చాలా వరకు మీడియాకి దూరంగా ఉంటాడు. సినిమా ప్రమోషన్ల టైంలో తప్ప ఎక్కువగా బయట కనిపించడు. అయితే తన ‘ధమాకా’ సినిమా వచ్చే నెల అంటే డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుండడంతో తన వంతు ప్రమోషన్లు మొదలుపెట్టాడు.

ఇందులో భాగంగా ‘ఢీ’ సీజన్ 14 ఫినాలేకి గెస్ట్ గా వచ్చాడు. ఈ షోలో హైపర్ ఆది కూడా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రవితేజ… హైపర్ ఆది పై నాన్ స్టాప్ గా సెటైర్లు వేసాడు. ‘మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్న నాకు మీతో ధమాకా మూవీలో నటించే ఛాన్స్ దక్కింది’ అంటూ హైపర్ ఆది అంటుంటే… ‘నేను కూడా ఎప్పటి నుండో నీతో చేద్దాం అనుకుంటున్నాను. అసలు నీకు ఈ ఢీ షో కి సంబంధం ఏంటి?’ అంటూ ప్రశ్నించాడు రవితేజ.

దాని హైపర్ ఆది మొహం పక్కకి పెట్టేసుకున్నాడు. అనంతరం ‘అసలు ఇతను ఎవ్వరినీ వదిలి పెట్టడు.. అందరినీ ఆడేసుకుంటాడు.. ఇవాళ నీకు ఉంది, నువ్వు అయిపోయావ్’ అంటూ రవితేజ వార్నింగ్ ఇచ్చాడు. హైపర్ ఆది ప్రతి సెలబ్రిటీ పై సెటైర్లు వేస్తూ స్కిట్స్ చేస్తాడు కాబట్టి రవితేజ ఇలా కామెంట్ చేసినట్టు స్పష్టమవుతుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus