Dhamaka: భారీ ధరలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ధమఖా!

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈయన నటించిన కిలాడి రామారావు ఆన్ డ్యూటీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఇకపోతే ఎన్నో అంచనాల నడుమ రవితేజ ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానుంది. త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల నటించారు.

ఇక ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ భారీ అంచనాలను పెంచింది. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేశారు.

ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిందీ రైట్స్ 10 కోట్లకు అమ్ముడు పోగా, సాటిలైట్ ఓటీటీ రైట్స్ 20 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇలా రవితేజ నటించిన కిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ధమాకా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ స్థాయిలో జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఈనెల 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించారు.మరి ధమాకా సినిమా ద్వారా రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus