ఇండస్ట్రీలో నెట్టుకు రావాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. ఆవగింజ అంత అదృష్ట కూడా ఉండాలని అంతా అంటుంటారు. కొంతమంది ఫిలిం మేకర్స్ ను చూస్తే ఇది నిజమేనేమో అని అనిపించకమానదు. మెహర్ రమేష్ (Meher Ramesh), రమేష్ వర్మ (Ramesh Varma) లాంటివి వాళ్ళు ఈ లిస్ట్..లోకే వస్తారు. ఈ దర్శకులు పెద్ద హీరోలతో పనిచేసినా.. ఒక్క హిట్టు కొట్టింది కూడా లేదు.ప్రస్తుతానికి మనం రమేష్ వర్మ గురించి చెప్పుకుందాం. ‘ఒక ఊరిలో’ ‘రైడ్’ (Ride) ‘వీర’ (Veera) ‘అబ్బాయితో అమ్మాయి’ (Abbayitho Ammayi) ‘రాక్షసుడు’ (Rakshasudu) ‘ఖిలాడి’ (Khiladi) వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు ఇతను.
Ramesh Varma
ఇందులో ‘రైడ్’ ‘రాక్షసుడు’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలా అని ఆ ‘రైడ్’ ‘రాక్షసుడు’ సినిమాలు హిట్లు అని కాదు. జస్ట్ యావరేజ్ గా కలెక్ట్ చేశాయి అంతే..! ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంటే.. హీరోలు, నిర్మాతలు దగ్గరకు రానివ్వరు. అయినప్పటికీ ఇతనికి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అందుకు కారణం ఇతనికి కోనేరు సత్యనారాయణ వంటి నిర్మాత సపోర్ట్ ఉండటం వల్ల అని చెప్పాలి.
ప్రస్తుతం రమేష్ వర్మ.. లారెన్స్ ను (Raghava Lawrence) హీరోగా పెట్టి ‘కాలభైరవ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికి దాదాపు రూ.80 కోట్లు బడ్జెట్ అవుతుందని వినికిడి. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టుని పట్టేశాడు రమేష్ వర్మ. అది కూడా ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కి (Ajay Devgn) ఇటీవల కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట రమేష్ వర్మ.
ఇది మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన కథ అని టాక్. దీనికి ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ అవుతుందట. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2025 సెప్టెంబర్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నార్త్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని రమేష్ వర్మ వంటి దర్శకులు క్యాష్ చేసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది.