Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్.. రికార్డ్ కొట్టిందిగా
- August 14, 2024 / 09:04 PM ISTByFilmy Focus
మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) , దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో మిరపకాయ్ (Mirapakay) వంటి సూపర్ హిట్ తర్వాత మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) రూపొందిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టిజి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిబొట్ల (Vivek Kuchibhotla) సహా నిర్మాతగా వ్యవహరించారు. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 15 న విడుదల కాబోతున్న ఈ సినిమా పై అవి అంచనాలు పెంచాయి.
Mr Bachchan

టీజర్, ట్రైలర్.. వంటివి కూడా సినిమా కచ్చితంగా చూడాలి అనే ఆశ ప్రేక్షకులకు కలిగించాయి. ఇక ఈ చిత్రం ప్రీమియర్స్ ఈరోజు అనగా ఆగస్టు 14 సాయంత్రం నుండీ ప్రదర్శించనున్నాయి. తెలుగు రాష్ట్రల్లో చాలా చోట్ల ఈరోజు సాయంత్రం 7 గంటల 5 నిమిషాల నుండీ మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ పడనున్నాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ట్రేడ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం..

మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) ప్రీమియర్స్ తోనే కోటిపైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అంటే సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. సినిమాకి కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రావడం ఖాయం. పైగా 4 రోజులు హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి.. త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.















