మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో ‘షాక్’ (Shock) ‘మిరపకాయ్’ (Mirapakay) వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆగస్టు 15న విడుదల కాబోతున్న ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడేలా చేశాయి.
Mr Bachchan
టీజర్, ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని, ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలకి చూపించడం జరిగింది.సినిమా చూసిన తర్వాత వారు ఈ విధంగా స్పందించారట. ఫస్ట్ హాఫ్ లో మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ ను చూపిస్తారట. ఓ పెళ్లి చూపులు.. అక్కడ జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ హైలెట్ గా ఉంటుందట.
తర్వాత హీరో తన సొంత ఊరికి రావడం. అక్కడ తన ఫ్రెండ్స్ తో జరిగే కామెడీ ట్రాక్స్, లవ్ ఎపిసోడ్ హైలెట్ ఉంటుందట. ఇంటర్వెల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్లడం నుండి కథ ఇంకో టర్న్ తీసుకుంటుందట. మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా గడిచిపోతుందట.
ఇక సెకండాఫ్ లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయట. డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తాయట. సాంగ్స్ వినడానికే కాదు.. చూట్టానికి కూడా హైలెట్ గా ఉంటాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. మరి ప్రీమియర్స్ తో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.