Saripodhaa Sanivaaram Trailer Review: ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ రివ్యూ.!
- August 13, 2024 / 09:54 PM ISTByFilmy Focus
నాని (Nani) , వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) అనే సినిమా వచ్చింది. అది మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అందుకే ఈసారి కంప్లీట్ గా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే సినిమా చేశారు. డివివి దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రానికి నిర్మాత. ఆగస్టు 29 న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం వదిలారు. ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 5 సెకన్ల నిడివి కలిగి ఉంది.
Saripodhaa Sanivaaram

‘నా సహనం నశించింది.. నా కన్నీళ్లు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక్కడుగు ముందుకేద్దాం అనుకుంటున్నా’ అంటూ హీరో చిన్నప్పటి పాత్రలో వచ్చే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్..’ సార్ సిఐ గారు ఎప్పుడొస్తారు సార్’ అని అడిగితే..సపోర్టింగ్ రోల్ చేస్తున్న శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar) ‘ఒక్కసారి ఆయన్ని చూశావ్ అనుకో.. ఇంకెప్పుడూ ఎప్పుడొస్తారు అని అడగవు’ అంటూ చెప్పడం విలన్(ఎస్.జె.సూర్య) (SJ Suryah) ఎంత క్రూరత్వం ఉన్న వ్యక్తో అర్థమవుతుంది.

ముఖ్యంగా విలన్ ఓ ఏరియాకి చెందిన జనాల్ని చావగొట్టడం, వారిని అణగదొక్కడం.. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చి ప్రతి శనివారం వాళ్ళ తరఫున ఎస్.ఐ ని చితగ్గొట్టడం వంటివి ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. మిగిలిన ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అయ్యే స్టఫ్ ఉంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ట్రైలర్ చివర్లో ‘పోతారు.. మొత్తం పోతారు’ అంటూ హీరో సింపుల్ గా చెప్పే డైలాగ్ కూడా మాస్ తో విజిల్స్ కొట్టించే లెవెల్లో ఉంటుంది అనే భరోసా ఇచ్చింది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :














