క్రాక్ సక్సెస్ తర్వాత రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో రావణాసుర పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ను ఒక్క సెట్టు కూడా వేయకుండా పూర్తి చేశారని సమాచారం. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత సెట్లు వేసి నిర్మించే సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెద్ద హీరోల సినిమాలు అంటే సెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే.
అయితే సుధీర్ వర్మ గత సినిమాల తరహాలోనే సహజమైన లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. సుధీర్ వర్మ రవితేజ రావణాసుర సినిమా విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా తగ్గే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. స్క్రిప్ట్ ప్రకారం సెట్లు అవసరం లేదు కాబట్టే దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా. సరైన సక్సెస్ లేని సుధీర్ వర్మ ఈ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది.
తక్కువ బడ్జెట్ తో సుధీర్ వర్మ తెరకెక్కించిన స్వామిరారా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా దోచెయ్, కేశవ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. సుధీర్ వర్మ రవితేజ ఇచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. క్రాక్ సక్సెస్ తో రవితేజతో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. రవితేజ ఒక్కో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నా సినిమా ఫ్లాప్ అయితే రవితేజ రెమ్యునరేషన్ ను కొంత మొత్తం వెనక్కు ఇచ్చేస్తారు.
40, 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో రవితేజతో సినిమాలను నిర్మిస్తే నష్టాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువేనని చెప్పవచ్చు. రవితేజ నటించే సినిమాలను అటు క్లాస్ ప్రేక్షకులతో పాటు ఇటు మాస్ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఇష్టపడతారు. రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సెట్లు లేకుండా సినిమాతో సక్సెస్ సాధించాలన్న రవితేజ సుధీర్ వర్మల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!