రాజా ది గ్రేట్ కలక్షన్స్ ని మించిన టచ్ చేసి చూడు ప్రీ రిలీజ్ బిజినెస్!

కొంచెం ఆలస్యంగా వచ్చిన రాజా ది గ్రేట్ తో మాస్ మహారాజ్ రవితేజ్ హిట్ అందుకున్నారు. అనిల్ రావి పూడి తెరకెక్కించిన ఈ సినిమా 52 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రవితేజ పవర్ ని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ రాబట్టడంతో రవితేజ మరో మెట్టు పైకి ఎదిగారు. రాజా ది గ్రేట్ తో నెలకొల్పిన రికార్డు తానే బద్దలు కొట్టారు. రవితేజ నటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడు రిలీజ్ కి ముందే రాజా ది గ్రేట్ కలక్షన్స్ రికార్డ్ ని బీట్ చేసింది. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే 33 .35 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. శాటిలైట్ రైట్స్ (16 కోట్లు) తో కలుపుకొని 50 కోట్ల మార్క్ ని చేరుకుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ కి ముంచే సంచలనం సృష్టిస్తోంది. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రేపు విడుదలవబోతోంది. రేపటి నుంచి ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.

టచ్ చేసి చూడు ప్రీ రిలీజ్ బిజినెస్..
నైజాం : 12 కోట్లు
సీడెడ్ : 5 కోట్లు
గుంటూరు : 2 .5 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1 .5 కోట్లు
వెస్ట్ గోదావరి :1 .5 కోట్లు
కృష్ణ : 1 .8 కోట్లు
నెల్లూరు : 1 కోటి
కర్ణాటక : 1 .55 కోట్లు
ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో : 2 .5 కోట్లు
ఆడియో రైట్స్ : 0.5 కోట్లుశాటిలైట్ : 16 కోట్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus