రవితేజ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ రూపొందించిన సినిమా ‘ఖిలాడి’. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. రవితేజ కెరీర్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. అయితే అంతకుమించే సినిమా బిజినెస్ జరిగిందని సమాచారం. కానీ సినిమాను రిలీజ్ చేయడానికే పరిస్థితులు అనుకూలించడం లేదు. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ అలానే ఉంది.
నైట్ కర్ఫ్యూ కారణంగా సెకండ్ షోకి అవకాశం లేదు. దీని కారణంగా చిత్రబృందం చెప్పినట్లుగా ఫిబ్రవరి 11న సినిమా రిలీజ్ అవుతుందా..? అవ్వదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. దర్శకనిర్మాతలు మాత్రం సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ రవితేజ మాత్రం పరిస్థితులు అనుకూలించేవరకు ఎదురుచూస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వారం రోజులు వెనక్కి వెళ్తే కోవిడ్ నిబంధనలు మారుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. .
అందుకే మిగిలి ఉన్న వర్క్ ను కావాలనే వాయిదా వేస్తున్నారట రవితేజ. ఆ విధంగా సినిమాను మరో వారం రోజులు వెనక్కి తీసుకువెళ్లాలనేది రవితేజ ప్లాన్. కానీ దర్శకుడు మాత్రం సినిమా వర్క్ సోమవారం నాటికి ఎలాగైనా పూర్తవుతుందని.. ఫిబ్రవరి 11న సినిమా రావడం ఖాయమని అంటున్నారు. మరోపక్క ఫిబ్రవరి 11న రావాల్సిన ‘డీజే టిల్లు’ సినిమా డేట్ ని 12కి మార్చారు. అయితే రవితేజ ‘ఖిలాడి’ రాకపోతే మాత్రం మళ్లీ ఫిబ్రవరి 11కి డేట్ మారుస్తారని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!