Akhanda Movie: ఇదీ బాలయ్య రేంజ్.. సంతోషంలో అభిమానులు!

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. సింహా, లెజెండ్ సినిమాలను మించి అఖండ విజయం సాధించడం గమనార్హం. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీలు సైతం ఈ సినిమా చూడటానికి థియేటర్లకు వస్తున్నాయి. అఖండ సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా బాలయ్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేశారు.

అఘోరా పాత్రలో బాలయ్యను తప్ప మరో నటుడిని ఊహించుకోలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను చూడటానికి నిజమైన అఘోరాలు థియేటర్లకు రావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో అఖండ ప్రదర్శితమవుతుండగా ఏ థియేటర్ దగ్గర చూసినా జై బాలయ్య అంటూ అరుపులు మారుమ్రోగుతున్నాయి. విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఉన్న బంగార్రాజు థియేటర్ కు నిజమైన అఘోరాలు వచ్చారు.

ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన అఘోరాలు బాలయ్య అఘోరా పాత్రలో బాగా నటించాడని సినిమా బాగుందని మీడియాకు చెప్పారు. ఆ తర్వాత శివ నామస్మరణ చేస్తూ అఘోరాలు బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇదీ బాలయ్య రేంజ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అఘోరాలు థియేటర్ కు వచ్చిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫుల్ రన్ లో అఖండ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది. అఖండ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య మార్కెట్ పెరగడం గమనార్హం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus