స్పైడర్ లో కీలకం కానున్న రియాల్టీ షో!
- September 11, 2017 / 02:11 PM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ షూటింగ్ పూర్తిచేసుకొని, వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ తాజాగా బయటికి వచ్చింది. స్పైడర్ సినిమాలో క్లైమాక్స్ లో హీరో మహేష్ రియాల్టీ షో తో విలన్ ఎస్.జె సూర్య ని పట్టుకుంటాడని తెలిసింది. గతంలో దూకుడు సినిమాలో ఈ రియాల్టీ షో మహేష్ కి బాగా కలిసి వచ్చింది. హాస్యాన్ని అందించింది.
అయితే ఇందులో ఈ షో సీరియస్ గా సాగుతుందంట. ముఖ్యంగా మహిళలు ఈ షోలో ఇన్వాల్వ్ కావడం విశేషమని చిత్ర బృందం చెప్పింది. టీవీ షో లపై మహిళలకు ఉన్న ఆసక్తిని ఉపయోగించుకొని, మహిళల ద్వారానే పరిశోధన చేయించి, విలన్ ఎక్కడున్నాడో హీరో కనిపెట్టే సన్నివేశం సినిమాలో హైలెట్ కానుందని వెల్లడించింది. ఈ కొత్త కాన్సెప్ట్ ని మురుగదాస్ ఎంత బాగా తెరకెక్కించారో మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న స్పైడర్ పై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















