మళ్ళీ షూటింగ్ ఆపేసిన రవితేజ.. కారణం అదే…!

మాస్ మహా రాజ్ రవితేజ గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇందులో ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఉన్నాయి. చెప్పాలంటే ఈ మూడు కూడా మంచి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రాలే..! కానీ కాంబినేషన్ బాగుంటే సరిపోదు కదా… కంటెంట్ ఉండాలి. అది లేకపోవడం వల్లే ఈ మూడు డిజాస్టర్లు గా మిగిలాయి. అంతే కాదు రవితేజ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. దీంతో తను చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అనేక మార్పులు చేశాకే ‘డిస్కో రాజా’ చిత్రాన్నిఓకే చేశాడు.

ఇటీవల ఈ చిత్రం మొదలయ్యి… మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ని హోల్డ్ లో పెట్టాడట. దీంతో పాటూ ఎప్పటినుండో అనుకుంటున్న ‘తేరి’ రీమేక్ ను కూడా పక్కన పెట్టేసాడని సమాచారం. అంతేకాదు మరో రెండుకొత్త ప్రాజెక్టులను ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇదిలా ఉంటే అసలు ‘డిస్కో రాజా’ చిత్రాన్ని రవితేజ హోల్డ్ లో పెట్టడానికి ముఖ్యకారణం ఏంటనేది ఎక్కువ చర్చనీయాంశం అయ్యింది. దీనికి అసలు కారణం ప్రస్తుతం రవితేజ ఫ్యామిలీ తో కలిసి ఫారెన్ టూర్ కు వెళ్ళే పనిలో బిజీగా ఉన్నాడట. అందుకే హోల్డ్ లో పెట్టాడట. మే లో ఇండియా కు తిరిగి వస్తాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus