టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలామంది ఉన్నప్పటికీ, వారందరిలో మన రాజ్ తరుణ్ స్టైల్ చాలా డిఫరెంట్. సహాయ దర్శకుడిగా కరియర్ స్టార్ట్ చేసి, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీతో సినిమా తీసి ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోవాలి అని అనుకున్న మన రాజ్ తరుణ అనుకోకుండా హీరో అయిపోయాడు. అయితే తన హీరోయిజాన్ని ‘ఉయ్యాల-జంపాల’ సినిమాతో మొదలు పెట్టిన మన కుర్ర హీరో, అటుపై సినిమా చూపిస్తా మామ, అంటూ రావు రమేశ్ తో హల్‌చల్ చేశాడు. ఇక మంచు ఫ్యామిలీతో కలసి ‘ఈడొరకం-ఆడోరకం’ చేసిన మన రాజ్ తరుణ్ అప్పట్లో కొన్ని ఫ్లాప్స్ రావడంతో మళ్ళీ హిట్ సినిమా కోసం పెద్ద కసరత్తె చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే మొదటి నుంచి ఈ హీరోపై ఇండస్ట్రీలో ఒక పెద్ద టాక్ నడుస్తుంది. అదేమిటంటే…కథల విషయంలో రాజ్ తరుణ్ చాలా ఈజీగా ఒప్పుకునేవాడు కాదని, కధలో వెరైటీ ఉంటేనే రాజ్ తరుణ్ ఒప్పుకుంటాడు అనేది నిర్మాతలు, దర్శకులు, రైటర్స్ నుంచి వినిపిస్తున్న వాదన. ఇదే క్రమంలో ఆడో రకం ఈడో రకం మూవీ తరువాత రాజ్ తరుణ్ పలు కథలని విన్నప్పటికీ..ఏ చిత్రానికి త్వరగా కమిట్ కాలేకపోయాడు. అందుకు కథ నచ్ఛకపోవటమే అనేది తన నిర్ణయం. చాలా కథలను విన్న తరువాత ఈ యంగ్ హీరో ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణాతో ఓ సినిమా చేస్తున్నాడు. మనవాడు వెరైటీ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి ఉంటుందా చెప్పండి…ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నాడు. ఈ సినిమాలో మనవాడు పెట్ కిడ్నాపర్ గా నటిస్తూ ఉండడం విశేషం.