మహేష్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇండియాలోని అందమైన హీరోలో టాప్ టెన్ జాబితాలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. అందుకే అక్కడి దర్శకనిర్మాతలు మహేష్ బాబుని సంప్రదించడం.. మహేష్ సింపుల్ గా నో చెప్పడమే చాలా సార్లు జరిగాయి. నమ్రతని పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ ఆఫర్లు మహేష్ కి మరింత పెరిగాయి. ఎందుకు రిస్క్ చేయడం అని అటువైపు వెళ్ళలేదు. బాహుబలి సినిమాని అనేక భాషలవారు ఆదరించడంతో మహేష్ కూడా ఇతర భాషల్లో విజయం సాధించాలని అనుకున్నారు.

గత ఏడాది స్పైడర్ చిత్రం ద్వారా తమిళం లోకి అడుగు పెట్టారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నిరాశపరిచింది. అయినా మహేష్ వెనక్కి తగ్గడం లేదు. ఈ సారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకే గతవారం ముంబై వెళ్లిన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన మహేష్ హైదరాబాద్ కి రాకుండా ఒక రోజు ముంబైలో ఉన్నారు. అప్పుడే కొన్ని కథలు విన్నట్టు చెప్పుకుంటున్నారు. కథలు వినడం మొదలు పెట్టారంటే త్వరలోనే మంచి కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గ్యారంటీ అని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 17 న సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus