నిహారిక సినిమాలు మానేయడానికి కారణం ఇదే!

“ఒక మనసు” చిత్రం తర్వాత మెగా డాటర్ నిహారిక చేసిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ రేవు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నిహారిక అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.
“హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నేను అక్ష‌ర అనే పాత్ర‌లో న‌టించాను. త‌ను తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల ఈ క‌థ మ‌లుపు తిరుగుతుంది. చుట్టూ బోలెడంతమంది న‌టీన‌టులు, ఓ పండ‌గ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో సాగే సినిమాలో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా. అది ఈ సినిమాతో తీరిపోయింది” అని తెలిపింది.

మరి నిజంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా … “మూడేళ్ళ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా. అప్పటి వరకు మంచి సినిమాలు చేస్తాను. క‌థ‌ల‌పైనే దృష్టి పెడ‌దామ‌నుకుంటున్నా. వెబ్ సిరీస్‌లు కూడా చేసే ఆలోచ‌న‌లున్నాయి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా” అని నిహారిక తన మనసులోని మాటను బయటపెట్టింది. అంతేకాకుండా మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఇండైరెక్ట్ గా స్పష్టం చేసింది. “ఒక మనసు” ఆర్ధికంగా విజయం సాధించక పోవడంతో హ్యాపీ వెడ్డింగ్ అయిన భారీ కలక్షన్స్ సాధించాలని నిహారిక కోరుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus