ప్రభాస్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ లాంటి ‘పాన్ ఇండియా’ చిత్రాన్ని 5 ఏళ్ళలో పూర్తి చేయడమంటే అంత సులభమైన పని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరో అలా కమిటవ్వడు అనడంలో అతిశయోక్తి కూడా లేదు. అది ప్రభాస్ మాత్రమే చేయగలిగాడు. అందుకే ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం నాలుగైదు బాషల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందుకో తాను నటించే ‘సాహో’ చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నాడు. ఇందులో హిందీ బాష కూడా ఒకటి. అందుకే ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా హిందీ నేర్చుకుంటున్నాడట.
అదేంటి సినిమా హిందీలో డబ్బింగ్ ఇవ్వడానికి హిందీ నేర్చుకోవాలా అనేగా మీడౌట్? విషయం ఏమిటంటే.. ‘సాహో’ హిందీ వెర్షన్ కి స్వయంగా ప్రభాసే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. ఈ విషయం పై ప్రభాస్ స్పందిస్తూ…” సినీ ప్రేమికులందరినీ అలరించే కథ, కథనం ‘సాహో’లో ఉన్నాయి. అందుకే ఆ చిత్రాన్ని హిందీలోనూ రూపొందిస్తున్నాం. నాకు హిందీలో మాట్లాడటం వచ్చు. కాకపోతే పర్ఫెక్ట్‌గా మాట్లాడాలనుకున్నాను. దాదాపు నెల రోజులకు పైగా సోనీ టీచర్ దగ్గర డైలాగుల్లో శిక్షణ తీసుకున్నా. ఫస్ట్ షెడ్యూల్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, రెండో షెడ్యూల్ నుంచి సులభంగా మాట్లాడగలిగాను. ‘సాహో’ హిందీ వెర్షన్‌లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏమైనా ప్రభాస్ డెడికేషన్ కు ప్రతీ ఒక్కరూ అభినందించాల్సిందే.