ఫిట్ గా కనిపించడం కోసం సినిమానే ఆపేశాడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గత వారం విడుదలయ్యి ప్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. మొదటి వీకెండ్ ప్రభాస్ స్టామినా.. హాలిడేస్, వినాయక చవితి సెలవు సాయంతో భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. అయితే మంగళవారం నుండీ ఈ చిత్రం కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి. కానీ హిందీలో మాత్రం సినిమా 120 కోట్ల పైనే వసూళ్ళు సాధించింది. వీక్ డేస్ లో కూడా అక్కడ మంచి కలెక్షన్లు వచ్చాయి. సో ప్రభాస్ కష్టం అక్కడ మాత్రం వృధా కాలేదు.

ఇక ‘సాహో’ తరువాత ప్రభాస్ ‘జాన్’ అనే చిత్రం చేయాల్సి ఉంది. ఇది ప్రభాస్ కు 20 వ చిత్రం. ఈ చిత్రం ఇప్పటీకే 20 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే గత 6 ఏళ్ళుగా ప్రభాస్ పెద్ద సినిమాలు చేస్తూ రెస్ట్ లేకుండా గడుపుతూ వచ్చాడు. ఇక ‘సాహో’ చిత్రానికి ముందు కూడా అటు హిందీలో.. ఇటు తెలుగులో తెగ ప్రమోషన్లు చేసాడు. దీంతో విడుదల తరువాత విదేశాలకి రెస్ట్ తీసుకోడానికి వెళ్ళిపోయాడని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. వరుసగా పెద్ద ప్రాజెక్టులు చేయడంతో ఇప్పటి వరకూ టైం కి తిండి, నిద్ర లేకపోవడం వల్ల ప్రభాస్ లుక్ చాలా మారిపోయింది. ‘సాహో’ సినిమాలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో తన 20 వ సినిమాలో ఫిట్ గా కనిపించడం కోసం విదేశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. ఒళ్ళు తగ్గించి మంచి లుక్ తో ఫ్యాన్స్ ను అలరించాలని ప్రభాస్ తెగ కసరత్తులు చేస్తున్నాడట. అందుకే ఈ ‘జాన్’ సినిమాకి కూడా బ్రేక్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ‘జాన్’ చిత్రాన్ని కూడా ‘యూవీ క్రియేషన్స్ సంస్థ’ నిర్మిస్తుండగా… ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus