కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు సుహాస్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ‘కలర్ ఫోటో’ చిత్రంతో ఎవ్వరూ ఊహించని విధంగా హీరో అయ్యాడు. అయితే ఆ సినిమా కరోనా లాక్ డౌన్ వంటి కారణాల వల్ల ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అక్కడ ఆ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత సుహాస్ ‘హిట్ 2’ లో విలన్ గా నటించాడు.
ఇవన్నీ అతనికి ఊహించని విధంగా ప్లస్ అయ్యాయని ఇటీవల రిలీజ్ అయిన ‘రైటర్ పద్మనాభం’ మూవీతో స్పష్టమైంది. ‘ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్’ అండ్ ‘లహరి ఫిలిమ్స్’ బ్యానర్ల పై సుహాస్ హీరోగా టీనా శిల్ప రాజ్ హీరోయిన్ గా… రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. టాక్ బాగుండడంతో ఈ సినిమా వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు లాభాలు అందించింది.
ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీ భారీ కలెక్షన్లు సాధించింది. అక్కడ 5 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. నిజానికి ఇది బయ్యర్స్ కూడా ఊహించలేదు. మొదట ‘రైటర్ పద్మనాభం’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మంచి రేటు దక్కకపోవడం వల్ల థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ పరంగానే మంచి లాభాలు అందించింది. బడ్జెట్ కూడా రికవరీ అయిపోయింది. ఇప్పుడు ఓటీటీల నుండి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ముందుగా అనుకున్న రేటుకి డబుల్ ఇస్తామని కొన్ని సంస్థలు ‘రైటర్ పద్మభూషణ్’ టీం ను సంప్రదిస్తున్నాయట. ఇలా ఈ మూవీకి రెండు రకాలుగా కలిసొచ్చినట్టు అయ్యింది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో కూడా ఈ మూవీ ఇంత బాగా కలెక్ట్ చేయడం అంటే గొప్ప విషయమే..!