2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కాంతార మూవీ ఒకటి కాగా బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం చూస్తే గతేడాది మిగతా సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమానే భారీ హిట్ కావడం గమనార్హం. అయితే ఈ సినిమా ఆస్కార్ కు ఎంపిక కాకపోవడం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. అయితే కాంతార ఆస్కార్ కు నామినేట్ కాకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలకు సంబంధించి ఆసక్తికర సమాధానాలు వినిపిస్తుండటం గమనార్హం.
కరోనా సమయం నుంచి ఓటీటీలకు ఆదరణ పెరిగిందని ఆ సమయంలో విభిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఆదరించాలని కాంతార నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు. అందువల్ల ప్రేక్షకులు సైతం కొత్త రకం కంటెంట్ ను మాత్రమే ఆదరిస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. ఇప్పటి ఫిల్మ్ మేకర్స్ లక్ష్యం కూడా ఇదేనని విజయ్ కిరంగదూర్ తెలిపారు. ఆర్ఆర్ఆర్, కాంతార సినిమాలు విజయం సాధించడం వెనుక అసలు కథ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.
కాంతార సినిమా వల్ల ప్రేక్షకులకు తుళు కల్చర్ పరిచయమైందని విజయ్ కిరంగదూర్ అన్నారు. ఇకపై కూడా కాంతార సినిమా తరహా కథలపై ఎక్కువగా దృష్టి పెడతామని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో కాంతార రిలీజైందని విజయ్ కిరంగదూర్ అన్నారు. అవార్డుల నామినేషన్స్ లోపు ఈ సినిమా గురించి ప్రచారం చేయడం సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రచారం చేయకపోవడంతో కాంతారకు ఎక్కువ అవార్డులు దక్కలేదని ఆయన అంగీకరించారు.
కాంతార2 సినిమా ఆ లోటును తీరుస్తుందని విజయ్ కిరంగదూర్ అన్నారు. కాంతార2 మూవీని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తామని 2024 చివర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన కామెంట్లు చేశారు. కాంతార నిర్మాత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.