Prabhas: ప్రభాస్ మార్కెట్ పెరగడం వెనుక ఇంత కష్టం ఉందా?

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు అన్న మాట వాస్తవమే. అందులో సందేహ పడనవసరం లేదు. కానీ స్టార్ గా ఎదగడానికి అదొక్కటే సరిపోదు. టాలెంట్ ఉండాలి… జనాలను తమ నటనతో మెప్పించగలగాలి.. మళ్ళీ మళ్ళీ థియేటర్ కు వారిని రప్పించగలగాలి. ఇది అసలు సిసలు స్టార్ డం అంటే..! అందుకే స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఇంత కష్టపడుతుంటారు. ఈ విషయంలో ప్రభాస్ శైలి కొంచెం వేరు.

2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నెగిటివ్ రోల్స్ చేసే కొల్లా అశోక్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. నిజానికి ఈ చిత్రాన్ని కేవలం రెండున్నర కోట్లలో తెరకెక్కించారు. చిత్రీకరణ మొత్తం కోటిన్నరలో పూర్తయిపోయింది. ప్రభాస్ డెబ్యూ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు, తక్కువ బడ్జెట్ లో ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు జయంత్ చెప్పుకొచ్చాడు.

ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర ప్లాప్ అయ్యింది. అయితే 2004 లో వచ్చిన ‘వర్షం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ప్రభాస్ ను టాప్ హీరోల లిస్ట్ లో చేర్చింది. మళ్ళీ ఆ తర్వాత చేసిన ‘అడవి రాముడు’ ‘చక్రం’ సినిమాలు ప్లాప్ అయ్యాయి. 5 సినిమాలు తీస్తే ఒక్క సినిమా మాత్రమే హిట్ అయ్యింది అది కూడా పాటలు, హీరోయిన్ మహిమ వల్ల అంటూ ఆ టైంలో ప్రభాస్ చాలా మాటలు పడ్డాడు.

అలాంటి టైంలో ‘ఛత్రపతి’ తో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. మళ్ళీ ఆ సినిమా తర్వాత హిట్టు కోసం 4 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. 2010 లో వచ్చిన ‘డార్లింగ్’ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అటు తర్వాత 2011 లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు. అయితే ‘రెబల్’ సినిమా మళ్ళీ ప్రభాస్ ను ప్లాపుల్లోకి నెట్టేసింది. ఈ క్రమంలో ‘మిర్చి’ సినిమా వస్తుంది అంటే జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే డైరెక్టర్ కొత్త, బ్యానర్ కొత్త..

అందుకే ఆ సినిమా పై అంచనాలు లేవు. కానీ ‘మిర్చి’ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కనుక రాకుండా ‘బాహుబలి’ ‘బాహుబలి2’ సినిమాలు ప్రభాస్ చేసుంటే నిజంగా రాజమౌళి వల్లే ప్రభాస్ పెరిగింది అనేవాళ్ళు. కానీ ‘బాహుబలి’ విషయంలో ప్రభాస్ కాంపెన్సేషన్ కూడా ఉందని జనాలకు లేట్ గా అర్థమైంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే అందులో అతని కష్టం కూడా ఉంది. అది గుర్తించే బాలీవుడ్ నిర్మాతలు సైతం ప్రభాస్ తో రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus