Prabhas: ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిసి ఖంగుతిన్న బాలీవుడ్ స్టార్స్?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ బాహుబలి తర్వాత తను నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సాహో, రాధేశ్యామ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక బాక్సాఫీసు వద్ద చతికిల పడ్డాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి నటిస్తున్న సినిమాల పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో నటించడం కోసం ప్రభాస్ ఏకంగా వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆది పురుష్.రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిసి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటివరకు పలు సినిమాలకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా 120 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా ఈయన అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు కూడా సానుకూలంగా స్పందించారు.

ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని టాప్ లో నిలిచారు.అయితే అక్షయ్ కుమార్ కన్నా ప్రభాస్ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభాస్ రెమ్యునరేషన్ తోనే ఆది పురుష్ సినిమా పై భారీ అంచనాలు పెంచారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీగా ఉన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus