‘రెడ్డిగారు’గా రెడీ అవుతున్న బాలయ్య!!
- May 17, 2017 / 07:06 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో అందంలోనూ, అభినయం లోను, డేర్ చెయ్యడం లోను, ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడంలోను బాలయ్యను మించిన హీరో లేడు అనే చెప్పాలి. అయితే వరుసగా రెండు, మూడు ఫ్లాప్స్ వస్తేనే భయపడిపోయి తెరమరుగు అయిపోతున్న హీరోలు ఉన్న ఈ కాలంలో, హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా ఎక్కడా క్రేజ్ తగ్గకుండా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నాడు మన బాలయ్య. ఇంకా చెప్పాలి అంటే, తాజాగా 100వ సినిమా విషయమే తీసుకుంటే, ఎవరైనా ప్రతిష్టాత్మక 100వ చిత్రం అంటే ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న ఆలోచనతో కమర్షియల్ కధను ఎంచుకుంటారు. కానీ అక్కడ కూడా బాలయ్య తాను అందరిలాంటి వాణ్ణి కాదు అని నిరూపించుకున్నాడు. తనదైన సాహసంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను ఎంచుకుని సెబాష్ అనిపించుకున్నాడు.
ఇక ఈ మ్యాటర్ అంతా పక్కన పెట్టి అసలు మ్యాటర్ లోకి వస్తే, టాలీవుడ్ లో ఫ్యాక్షన్ చిత్రాలకు ఊపిరి పోసిన ఏకైక హీరో ఎవరు అంటే మన బాలయ్యే అని చెప్పక తప్పదు. ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు , చెన్నకేశవరెడ్డి ఇలా పవర్ ఫుల్ టైటిల్స్ తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు అప్పట్లో టాలీవుడ్ చరిత్రను తన సినిమాలతోనే తిరగ రాసిన హీరో బాలయ్య. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసుంటే ఈ చిత్రానికి ”రెడ్డి గారు ” అనే పవర్‌ఫుల్ టైటిల్ ని పెట్టడానికి ఆలోచన చేస్తున్నారట, ఇప్పటికీ ఈ టైటిల్ ను పరిశీలనలో పెట్టారట. మరి కధకు సరిపోతుందో, లేక పాత్రను పోలి ఉందో తెలీదు కానీ, ఈ టైటిల్ మాత్రం టాలీవుడ్ లో బాలయ్యకు మాత్రమే సరిపోతుంది అని చెప్పక తప్పదు. మొత్తంగా ఇదే నిజం అయితే నందమూరి అభిమానులు మరో ఫ్యాక్షన్ హిట్ కి సిద్దంగా ఉండాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















