Regina: ఐటెమ్ సాంగ్‌పై స్పందించిన రెజీనా

‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు చాలా రకాల పుకార్లు వచ్చాయి. వాటిలో ఎక్కువ రోజులు వార్తల్లో నిలిచి, ఆ తర్వాత ‘ఇది నిజం’ కాదు అని తేల్చేసిన విషయం ఒకటి ఉంది. అదే ఈ సినిమాలో రెజీనా ప్రత్యేక గీతంలో నటించడం. సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందని, అందులో చిరంజీవి సరసన రెజీనా నటిస్తోందని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎక్కడా అధికారికంగా సమాచారం రాలేదు. రెజీనా కూడా అలాంటిదేం లేదు అన్నట్లు గుర్తు. కానీ పాట రిలీజ్‌ అయ్యేసరికి అసలు విషయం బయటికొచ్చింది.

‘సానా కష్టం…’ అంటూ సాగే పాటలో చిరంజీవి తనదైన మెస్మరైజింగ్‌ గ్రేస్‌ను చూపించాడు. ఆ స్టెప్పులు చూస్తుంటే ‘వింటేజ్‌చిరంజీవి’ కనిపించాడు ఫ్యాన్స్‌కి. అయితే ఈ పాటలో రెజీనా ఏమంత అట్రాక్టివ్‌గా లేదు అనే మాటలైతేవచ్చాయి. అయితే ఈ పాట కోసం రెజీనా ‘శానా కష్టం’ పడిందట. ఈ విషయం ఆమే చెప్పింది. ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ ఈ పాటతోనే మొదలైందట. నాలుగు రాత్రుల్లో పాటను పూర్తిచేశారట. ఇప్పటివరకు నేను ఇలాంటి పార్టీ సాంగ్స్‌/ స్పెషల్‌ పాటల్లో నటించలేదు. చిరంజీవి కోసమే తొలిసారి ఒప్పుకున్నాను అని చెప్పింది రెజీనా.

అంతేకాదు సినిమా సెట్‌లో జరిగిన విషయాలను కూడా చెప్పింది రెజీనా. చిరంజీవిని మెగాస్టార్‌ అని ఎందుకు పిలుస్తారో సెట్స్‌లో చూస్తే అర్థమైంది అంటూ ఆకాశానికెత్తేసింది రెజీనా. చిరంజీవి డ్యాన్స్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనెప్పుడూ యువ నటులను ప్రోత్సహిస్తుంటారు అంటూ చిరంజీవి గురించి చెప్పుకొచ్చింది రెజీనా. ఈ పాటలో చేశావా అంటే అప్పుడు లేదని చెప్పింది మరి ఎందుకో తెలియదు. ఇందులో ఎందుకు అంత అట్రాక్టివ్‌గా లేదో కూడా తెలియదు.

చిరంజీవి కథానాయకుడిగా, రామ్‌చరణ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్‌ కథానాయిక. పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది. దేవాదాయ శాఖ, నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 4న సినిమా విడుదలవ్వాలి. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా వాయిదా పడొచ్చని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus