Bheemla Nayak: పోస్ట్‌ పెట్టి రెస్పాన్స్‌ చూస్తున్నారా.. ఏంటిది అంటున్నారు?

వీలైతే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్‌ 1న సినిమా విడుదల చేస్తాం అని చాలా రోజుల క్రితమే ప్రకటించేసింది ‘భీమ్లా నాయక్‌’ టీమ్‌. అయితే ఫిబ్రవరి 15 వరకు సినిమా డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు సినిమా షూటింగ్ జరుగుతోందని వార్తలు వచ్చాయి. దీంతో ఇక ఫస్ట్‌ డేట్‌కి ‘భీమ్లా నాయక్‌’ రావడం కష్టమే అనుకున్నారు అంతా. మరోవైపు ‘గని’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, ‘సెబాస్టియన్‌’ సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటించేశాయి. దీంతోపాటు ప్రచారం కూడా షురూ చేశాయి.

Click Here To Watch

‘ఆడాళ్లు మీకు జోహార్లు’ టీమ్‌ అయితే ఫుల్‌ స్వింగ్‌లో ప్రచారం షురూ చేశాయి. దీంతో ఇక ‘భీమ్లా నాయక్’ సినిమా ఏప్రిల్‌ 1నే వస్తుంది అని అంతా ఫిక్స్‌ అయిపోయారు. అయితే ఫిబ్రవరి 15న నిర్మాణ సంస్థ రాత్రి 9 తర్వాత సినిమా రిలీజ్‌ డేట్‌ను పక్కా చేస్తూ ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 25నే వచ్చేస్తున్నాం అంటూ ప్రకటించేసింది. దీంతో మిగిలిన మూడు సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతా ఓకే ఇక రిలీజ్‌ చేయడమే ఆలస్యం అనుకుంటుండగా ఇలా చేయడమేంటి అనుకుంటున్నారు.

సినిమా రిలీజ్‌ డేట్‌ల విషయంలో అందరం కలసి చర్చించుకొని అనౌన్స్‌ చేస్తాం అని దిల్ రాజు ఆ మధ్య చెప్పారు. అలాంటిది ‘భీమ్లా నాయక్‌’ విషయంలో ఇలా చేయడమేంటి అంటున్నారు. అదేంటి ఈ సినిమా నిర్మాణ సంస్థ వేరేది కదా అంటారా. నిర్మాతలు వేరే కావొచ్చు గతంలో ‘భీమ్లా..’ వాయిదా విషయంలో దిల్‌ రాజునే కీలకంగా వ్యవహరించారు. ఆయన ఈ సినిమాను నైజాంలో రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఇబ్బందులు లేకుండా సంక్రాంతి టైమ్‌లో అడ్జస్ట్‌ చేశారు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అయ్యిందప్పుడు.

మరిప్పుడు శివరాత్రికి ఏంటిది అనుకుంటున్నారు నెటిజన్లు. ‘భీమ్లా నాయక్‌’ ఫిబ్రవరి 25నే వచ్చేస్తాడు అని ట్వీట్‌ పెట్టి రెండు రోజులు అయ్యింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ నుండి ఎలాంటి మూమెంట్‌ లేదు. సినిమాకు ఇంకా 10 రోజులే ఉంది. ప్రచారం స్పీడ్‌ పెంచాలి. కానీ అలాంటిదేం కనిపించడం లేదు. దీంతో సినిమా మళ్లీ వాయిదా పక్కా అంటున్నారు. దీనిపై చిత్రబృందమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేదంటే ప్రచారం స్పీడ్‌ అయినా పెంచాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus