వైరల్‌: మన దగ్గర కథలే లేవంటారా పవర్‌ స్టార్‌

‘భీమ్లా నాయక్‌’ బ్లాక్‌బస్టర్‌ ఆనందంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మనసుల్లో ఓ చిన్న అసంతృప్తి కనిపిస్తోంది. కారణం… పవన్‌ కల్యాణ్‌ ఫ్యూచర్‌ సినిమాల లైనప్‌ మీద వస్తున్న వార్తలే. ‘భీమ్లా నాయక్‌’ విజయం ఇచ్చిన ఆనందంలో పవన్‌ కల్యాణ్‌ మరో రెండు రీమేక్‌ సినిమాలు చేయడానికి అంగీకరించారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు కాస్త దూరమయ్యారు. రీఎంట్రీని రీమేక్‌తోనే ప్రారంభించారు. ‘పింక్‌’ సినిమాను ‘వకీల్‌ సాబ్‌’గా మార్చి తెలుగులో చేశారు. సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ను తెలుగులో ‘భీమ్లా నాయక్‌’గా మార్చి తీసుకొచ్చి భారీ విజయం సాధించారు. ఈ సినిమాల తర్వాత చేస్తున్న రెండు సినిమాలు రీమేక్‌లు కాదు. క్రిష్‌ ‘హరి హర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ స్ట్రెయిట్‌ మూవీసే. అయితే ఇక్కడే సమస్య వచ్చింది. ఆ తర్వాత పవన్‌ ఓకే చేశారు అంటున్నవి రీమేక్‌లే.

సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తూ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘వినోదాయ సీతాం’. ఈ సినిమాకు అక్కడ మంచి స్పందనే వచ్చింది. దీనిని తెలుగులో పవన్‌ కల్యాణ్‌ నిర్మిస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అందులో నటిస్తాడని కూడా అంటున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ మరో హీరోగా ఆ సినిమాలో నటిస్తాడట. ఇదిలా ఉండగా ‘తెరి’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలనే ఆలోచనతో పవన్‌ ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా తెలుగులో వచ్చిందనుకోండి.

ఈ వార్తలన్నీ చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్‌ వల్ల ఇన్‌స్టంట్‌ హిట్‌ కథ దొరికేటప్పటికీ… ఇలా రీమేక్‌లు ఎన్ని రోజులు అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన పడుతున్నారు. పవన్‌ సినిమా అంటే కథ రాయని రచయిత ఉండరు, తీయడానికి రెడీగా ఉండని దర్శకుడూ ఉండరు. అలాంటిది పవన్‌ ఇలా చేస్తుండటం పవన్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టే విషయమే. పవర్‌ స్టార్‌ ‘రీమేక్‌’ పవర్‌ సూపరే… ఒరిజినల్‌ పవర్‌ కూడా చూపించాలి మరి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus