రీమిక్స్ కింగ్.. అనూప్

  • August 18, 2016 / 10:01 AM IST

దర్శకుడు తేజ చిత్రం “జై” ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్. ఆలస్యంగా ఇష్క్ సినిమాతో బ్రేక్ అందుకున్నారు. “మనం”తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత టెంపర్, గోపాల గోపాల, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు చేసి టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుశాంత్ హీరోగా నటించిన “ఆటాడుకుందాం..రా” సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇందులోని పాటలు అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా “పల్లెకు పోదాం ” పాటను రీమిక్స్ చేసిన విధానం విని .. అందరూ అనూప్ ని “రీమిక్స్ కింగ్” గా కీర్తిస్తున్నారు. ఆయనకు ఈ పేరు రావడానికి వెనుకున్న పాటలు ఏంటో చూద్దామా..

కోడిపాయే లచ్చమ్మది

తెలంగాణ జానపదాల్లో “కోడిపాయే లచ్చమ్మ ది” కి మంచి స్థానం ఉంది. ఆ గీతానికి సినీ హోదాను తెప్పించారు అనూప్ రూబెన్స్. యాంగ్ హీరో నితిన్ నటించిన ఇష్క్ సినిమాలో కోడిపాయే లచ్చమ్మ ను పబ్ పాటకు మిక్స్ చేసి అభినందనలు అందుకున్నారు.

ఏమైందో ఏమో ఈ వేళా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమా “తొలి ప్రేమ”లోని “ఏమైందో ఏమో ఈ వేళా” పాటను అద్భుతంగా రీమిక్స్ చేసారు. హీరో నితిన్ కోరిక మేరకు పూర్తి పాటను తన బీట్ తో మేళవించి మనకి అందించారు. “గుండెజారి గల్లంతయ్యిందే” సినిమాకోసం చేసిన ఈ రీమిక్స్ పాట మరోసారి సూపర్ హిట్ సాంగ్ జాబితాలో చేరిపోయింది.

పియ్యో పియ్యో రో

తెలుగు ప్రేమ కథ సినిమాలు అనగానే ముందుగా దేవదాసు, ప్రేమనగర్ గుర్తుకు వస్తాయి. ఏఎన్ఆర్ ప్రేమ కావ్యం ప్రేమనగర్ లోని “నేను పుట్టాను” పాట ఫ్లేవర్ మిస్ కాకుండా “మనం” చిత్రం కోసం ” పియ్యో పియ్యో రో” సాంగ్ లో పర్ ఫెక్ట్ గా మిక్స్ చేసి అక్కినేని అభిమానుల మెప్పు పొందాడు.

ఒక లైలా కోసం

https://www.youtube.com/watch?v=kLQnKW5gI9o

“రాముడు కాదు కృష్ణుడు” సినిమాలో ఏఎన్ఆర్ డాన్స్ చేసిన “ఒక లైలా కోసం” పాటని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా రీమిక్స్ చేశారు అనూప్. యువ సామ్రాట్ నాగచైతన్య సినిమా “ఒక లైలా కోసం” ఈ పాటను కథకు తగ్గ మార్పులు చేయడంలో మ్యూజిక్ డైరక్టర్ విజయం సాధించారు.

అక్కినేని అక్కినేని

అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటించిన “అఖిల్” చిత్రం కోసం అనూప్ కొత్త కిక్ ఇచ్చారు. “అక్కినేని అక్కినేని” పాటలో కింగ్ నాగార్జున “హలో బ్రదర్” చిత్రంలోని హిట్ గీతాన్ని షార్ట్ మిక్స్ చేశారు. “కన్నెపెట్టరో, కన్ను గొట్టరో”సాంగ్ లోని థీమ్ మ్యూజిక్ ని మరింత పవర్ ఫుల్ గా అందించారు. నాగ్, అఖిల్ తో డ్యాన్స్ వేయడానికి మంచి ఊపు ఇచ్చారు.

చక్కర కేళి చిన్నోడు

కింగ్ నాగార్జున తాజా హిట్ చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని అనూప్ రీమిక్స్ మ్యాజిక్ తో అలరించాడు. అలనాటి హిట్ సినిమా “ఆస్తిపరులు” లోని అక్కినేని నాగేశ్వరరావు పాటకు కొత్త లిరిక్స్ జోడించి, ఆ ట్యూన్ కి సరికొత్త బీట్ రీమిక్స్ చేసి మంచి కాక్ టైల్ లాంటి పాటని ఇచ్చారు.

పల్లెకు పోదాం

https://www.youtube.com/watch?v=PhsTqxatwn8

తాజాగా సుశాంత్ హీరో గా నటించిన “ఆటాడుకుందాం..రా” సినిమాకు అలనాటి దేవదాసు సినిమాలోని “పల్లెకు పోదాం” పాటని అద్భుతంగా రీ మిక్స్ చేసి అనూప్.. రీమిక్స్ కింగ్ అనే పేరు తెచ్చుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus