విక్టరీ వెంకటేష్, రానా కలిసి తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేశారు. నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు కానీ సెట్ కాలేదు. ఫైనల్ గా ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పుడు సినిమాల కంటే ఓటీటీ కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్ లో వెబ్ సిరీస్ లంటే భారీగా ఖర్చు చేస్తున్నారు. మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలైంది.
ఫ్యూచర్ లో తెలుగు నుంచి కూడా భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లు రావడం ఖాయం. ఇప్పుడు రానా, వెంకీలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది. దీనికోసం బాగానే ఖర్చు చేసింది సదరు సంస్థ. ఈ సిరీస్ లో రానా నాయుడుగా రానా, అతడి తండ్రి నాగా నాయుడుగా వెంకటేష్ నటించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ మంచి బజ్ ను క్రియేట్ చేసింది.
రానా, వెంకీ కూడా సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ ను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సిరీస్ చేయడానికి బాబాయ్, అబ్బాయ్ లు గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ నిర్మించిన ప్రాజెక్ట్ అంటే రెమ్యునరేషన్స్ గట్టిగానే ఇస్తారు. వెంకీ, రానాలకైతే వారు రెగ్యులర్ తీసుకునేదానికంటే డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
సాధారణంగా వెంకీ.. ఒక్కో సినిమాకి ఐదారు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆయన చివరిగా నటించిన ‘ఎఫ్3’ సినిమాకి కూడా అంతే ఇచ్చారు. కానీ ‘రానా నాయుడు’ సిరీస్ కోసం అతడికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చారట. అలానే రానాకి రూ.8 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. రానా కూడా ఐదు కోట్లలోపే రెమ్యునరేషన్ తీసుకునేవారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో ఇద్దరూ దాదాపు డబుల్ రెమ్యునరేషన్స్ అందుకున్నట్లే!
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?