బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ 19మంది రెమ్యూనిరేషన్స్ తెలిస్తే షాక్ తినాల్సిందే..!

  • December 21, 2021 / 11:59 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆశించినంత ఫలితాన్ని అందుకుందో లేదో పక్కనబెడితే , ఈసీజన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల పంట మాత్రం బాగానే పండింది. వాళ్లకి బాగానే గిట్టుబాటు అయ్యినట్లుగా అనిపిస్తోంది. అంతేకాదు, ఈసారి సీజన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లకిచ్చిన పేమెంట్స్ చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఫైనల్ గా ఒక్కొక్కరికి ఎంతొచ్చిందో మనం చూసినట్లయితే..,విన్నర్ గా నిలిచిన సన్నీకి బాగానే వర్కౌట్ అయ్యింది.

సన్నీ షోలో ప్రవేశించేటపుడు వారానికి రెండు లక్షరూపాయల చొప్పున అగ్రిమెంట్ చేస్కున్నట్లుగా సమాచారం. దీనివల్ల 15వారాలు ఉన్నాడు కాబట్టి, 30 లక్షల రూపాయలు రెమ్యూనిరేషన్ ముట్టింది. దీంతోపాటుగా ప్రైజ్ మనీ 50 లక్షలు, సువర్ణభూమి వారు ఇచ్చిన 25లక్షల రూపాయల విలువగల ల్యాండ్, అలాగే 2 లక్షల రూపాయల విలువగల టివియస్ అపాచీ బైక్ సంపాదించుకున్నాడు. దీంతో 80 లక్షల క్యాష్, 27లక్షల గిఫ్ట్స్ ని అందుకున్నాడు సన్నీ. దీంతో కోటిరూపాయలకి పైగానే బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్నాడు.

ఇక సెకండ్ ప్లేస్ లో రన్నరప్ గా నిలిచిన షణ్ముక్ జస్వంత్ కి విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే వచ్చిందని టాక్. వారానికి నాలుగు లక్షల నుంచీ ఐదు లక్షల వరకూ పారితోషకాన్ని అందించినట్లుగా టాక్. షణ్ముక్ మొత్తం 15 వారాలకి 70 లక్షల కంటే పైనే వచ్చిందని చెప్తున్నారు. దీన్ని బట్టీ చూస్తే విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా ఇది చాలా ఎక్కువ.

తర్వాత టాప్ 5 లో నిలిచిన సిరికి కూడా రెమ్యూనిరేషన్ బాగా వచ్చినట్లుగా తెలుస్తోంది. హౌస్ లోకి వెళ్లే ముందు వారానికి రెండు లక్షల రూపాయల వరకూ అగ్రిమెంట్ చేస్కున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టీ చూస్తే 15 వారాలకి దాదాపుగా 30 లక్షలు వచ్చినట్లుగా సమాచారం. దీంతో సిరి ఫుల్ హ్యాపీగా ఉందట. ట్రోఫీ గెలవకపోయినా ప్రైజ్ మనీలో సగం పైనే గెలుచుకుంది సిరి.

ఇక టాప్ 5లో ఉన్న మానస్ కి కూడా బిగ్ బాస్ టీమ్ నుంచీ బారీగానే రెమ్యూనిరేషన్ వచ్చినట్లుగా టాక్. మానస్ కి వారానికి రెండు లక్షలకు పైగానే వచ్చిందని, మొత్తం మీద 40 లక్షల వరకూ 15వారాలకి అందుకున్నాడు అని అంటున్నారు.

అలాగే, శ్రీరామ్ చంద్రకి కూడా హ్యూజ్ గానే ముట్టజెప్పినట్లుగా సమాచారం. వారానికి మూడు లక్షలు రూపాయల పైగానే ఆల్ మోస్ట్ ప్రైజ్ మనీకి దగ్గర్లో 50 లక్షల పైచిలుకు అందుకున్నాడట.

ఇక అందరికంటే కూడా యాంకర్ రవికి హైఎస్ట్ రెమ్యూనిరేషన్ వచ్చిందని, ఇంతవరకూ బిగ్ బాస్ సీజన్ లో ఇదే హైఎస్ట్ అని అంటున్నారు. వారానికి 7 లక్షల నుంచీ 8 లక్షల వరకూ రెమ్యూనిరేషన్ మాట్లాడుకుని హౌస్ లోకి వెళ్లాడని, 12 వారాలకి దాదాపుగా 90 లక్షల వరకూ పేమెంట్ అందుకున్నట్లుగా చెప్తున్నారు. బిగ్ బాస్ సీజన్ లో ఇదే హైఎస్ట్ పారితోషికమని అంటున్నారు.

ఇక మనం బిగ్ బాస్ హౌస్ లో వారానికి కొంతమంది రెమ్యూనిరేషన్స్ చూసినట్లయితే, కాజల్ వారానికి రెండు లక్షలు చొప్పున 14 వారాలకి కాను దాదాపుగా 30 లక్షలు

ప్రియాంక సింగ్ 1.75 నుంచీ 2 లక్షల చొప్పున దాదాపుగా 13 వారాలకి 25 లక్షలు పైనే వచ్చాయి

అనీమాస్టర్ వారానికి 3 లక్షలు చొప్పున 11 వారాలకి 33 లక్షలు పైనే వచ్చాయని టాక్.

జెస్సీకి 1.5 లక్షలు చొప్పున 10 వారాలకి 15 లక్షలు పైనే వచ్చాయి.

లోబోకి రెండు లక్షలు 40 వేల చొప్పున 18 నుంచీ 20 లక్షలకి పైగానే వచ్చినట్లుగా టాక్.

ఆర్టిస్ట్ ప్రియాకి వారానికి 1.5 లక్షల చొప్పున 7 వారాలకి గానూ 10 లక్షలు పైనే వచ్చాయి.

శ్వేతావర్మకి ఒక్కోవారానికి 1 లక్షరూపాయల చొప్పున ఆరువారాలకి ఆరు లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

నటరాజ్ మాస్టర్ కి 1 లక్షరూపాయల చొప్పున నాలుగు వారాలకి దాదాపుగా 4 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఉమాదేవికి వారానికి 80 వేలు చొప్పున రెమ్యూనిరేషన్

సరయుకి వారానికి 60 వేల చొప్పున రెమ్యూనిరేషన్

లహరికి కూడా వారానికి 60 వేల చొప్పున రెమ్యూనిరేషన్స్ ఇచ్చినట్లుగా టాక్.

విశ్వకు 9 వారాలకు గానూ 22 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది!

హమీదా ఒక్క వారానికి 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది!

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus