ఒక్క టికెట్‌ రేటుకే.. కుటుంబం మొత్తం చూసేయొచ్చు!

  • June 3, 2022 / 04:23 PM IST

ఒక్క వ్యక్తే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే ఎంత ఖర్చవుతుంది. తక్కువలో తక్కువ సింగిల్‌ స్క్రీన్‌కి వెళ్తే రూ.200 నుండి రూ. 250 అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌కి వెళ్తే రూ.300 నుండి రూ.400 అవుతుంది. అదే సినిమా ఇంట్లో కూర్చుని రూ.200కే కుటుంబం మొత్తం చూస్తే.. అదిరిపోయింది కదా ఆలోచన. కానీ థియేటర్‌ రిలీజ్‌కి, ఓటీటీ రెంటల్‌ రిలీజ్‌కి ఓ రెండు, మూడు వారాలు గ్యాప్‌ ఉంటే ఏది బెటర్‌. కుటుంబం మొత్తం థియేటర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఓటీటీ రెంటల్‌ బెటర్‌ అంటారా? మీరే కాదు చాలామంది ఇదే అనుకుంటున్నారు.

అసలు ప్రేక్షకుల్లో ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఎవరో కాదు నిర్మాతలు, ఓటీటీలే అంటున్నారు ట్రేడ్‌ పరిశీలకులు. ‘కేజీయఫ్‌ 2’కి అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో తెచ్చారు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’కు కూడా అదే పని చేశారు. దీని వెనుక ఓటీటీ మార్కెటింగ్‌ స్ట్రాటజీలు చాలానే ఉండొచ్చు. కానీ థియేటర్లలో సినిమా ఇంకా ఆడుతున్నప్పుడు రూ. 199కి ఓటీటీలో వేస్తే థియేటర్‌కి జనాలు వెళ్తారా? లేదనే అంటున్నారు నెటిజన్లు, పరిశీలకులు.

మరీ భారీ చిత్రాలు, వెండితెర మీదనే చూడాలి అనిపించే సినిమాలకైతే థియేటర్లలో తొలి రెండు వారాల్లో వెళ్లి చూసేస్తుంటారు. మళ్లీ ఓటీటీలో చూడాలంటే అదనంగా డబ్బులు పెట్టడానికి ఇష్టపడరు. ఎక్కడ చూసినా ఫర్వాలేదు అనిపించే సినిమాలను రూ. 200 పెట్టి ఇంట్లోనే చూసేస్తారు. అది కూడా కుటుంబం అంతా. ఒకవేళ ఇది అన్ని సినిమాలకు వర్తించి, ప్రేక్షకులు అందరూ ఇదే మాట అనుకుంటే థియేటర్ల నెత్తిన నిర్మాతలు, ఓటీటీలు బండరాయి ఎత్తిపడేసినట్లే.

ఓటీటీలకు నిర్మాతలు ఎక్కువ రేటుకి సినిమా అమ్ముతారు. నిర్మాతలకు ఓటీటీలు ఎక్కువ రేటు ఇచ్చి సినిమా కొనుక్కుంటాయి. కాబట్టి అంత కంటే ఎక్కువ డబ్బులు తెచ్చుకోవడానికి ఓటీటీలు తమ ప్రయత్నాలు తాము చేస్తాయి. అందులో వాళ్ల తప్పేం లేదు. అయితే థియేటర్లలను చంపేసేలా రెంటల్‌ విధానం మొదలైతే.. కష్టమే అని చెప్పాలి. అయితే ఇదంతా నిర్మాతలు, థియేటర్ల వాళ్లు చూసుకోవాల్సిన అంశం. ప్రేక్షకుల మీద వాళ్లకు ఎలాగూ ప్రేమ లేదు. అందుకే వందలకు వందలు టికెట్‌ రేట్లు పెంచి పిండుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీకి వాళ్ల జేబుకు కత్తిరేస్తున్నాయి. అది కూడా నిర్మాతలకు చెప్పే.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus