ఈ మధ్యకాలంలో సినిమాలతో కాకుండా వార్తల్లో నిలుస్తున్న వారి లిస్టులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. పవన్ తో విడిపోయాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీనికి పవన్ ఫ్యాన్స్ నుండీ తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో.. వరుడు పిక్ ను ఆమె ఇప్పటివరకూ చూపించలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులవుతున్నా.. ఇంకా ఈమె రెండో పెళ్లి చేసుకోలేదు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. ఈమె గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది రేణూ దేశాయ్.
నిజానికి రేణూ.. నటి అవ్వాలి అని ఎన్నడూ అనుకోలేదట. ఆమె ఆశయం వేరని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆమె సినిమాల్లోకి రాకముందు.. అంతరిక్ష శాస్త్ర వేత్త కావాలనుకుందట. అదే ఆమె డ్రీమ్ అని తెలిపింది. ఒకవేళ పరిస్థితుల రీత్యా అది కుదరని పక్షంలో డాక్టర్ అవ్వాలని కలలు కనిందట. అయితే అది కూడా నెరవేరకపోవడం…ఊహించని విధంగా తన 18వ ఏట హీరోయిన్ గా మారడం జరిగినట్టు చెప్పుకొచ్చింది. 2000 వ సంవత్సరంలో ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రేణూ.. తరువాత అతనితో ‘జానీ’ చిత్రంలో కూడా నటించింది.
అంతేకాదు పవన్ నటించిన ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్’, ‘బాలు’, ‘అన్నవరం’ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేసింది రేణు దేశాయ్. మొన్నటి వరకూ ఓ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యే ఓ షోకి జడ్జిగా కూడా వ్యవహరించిన సంగతి కూడా తెలిసిందే..!
Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?