రేణూ దేశాయ్‌ నిశ్చితార్థం అనంతరం చర్చ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ పిల్లలే ప్రపంచంగా జీవించింది. వారు పెద్దవారు అయిన తర్వాత తనకి ఓ తోడు కావాలని కోరుకుంది. తన మనసును అర్ధం చేసుకున్న వాడు దొరకగానే చెయ్యి అందించింది. ఇదివరకే వారిద్దరూ చెయ్యి చెయ్యి ఫోటోని రేణు స్వయంగా బయటపెట్టింది. ఇప్పుడు నిశ్చితార్ధం చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. బాధ నుంచి కోలుకునేందుకు తనకు సహాయంగా నిలిచిన నిజాయతీ మనసుకు ధన్యవాదాలంటూ తనకు కాబోయే భర్తకు థ్యాంక్స్ చెప్పింది.

పవన్‌ ఫ్యాన్స్ నుంచి తనకు ఎక్కువగా అభినందనలతో పాటు సహకారం అందడంపై రేణు హర్షం వ్యక్తం చేసింది. అంతేకాకుండా “నా పిల్లలు నాతో లేకపోతే నా సంతోషానికి అర్థం లేనట్టే. నా జీవితంలో సంతోషకరమైన భాగాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరూ పక్కనే ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది” అంటూ పేర్కొంది. అయితే రేణు తనకి కాబోయే భర్త ఫోటో ని షేర్ చేయకపోవడంతో ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు, అభిమానులు వెతికారు. రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు. తాజాగా రేణు, కాబోయే భర్త కలిసి ఉన్న ఫోటో మాత్రం బయటికి వచ్చింది. ఇక వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus