Renu Desai: ఇంటర్వ్యూ : ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి రేణు దేశాయ్ చెప్పిన ఆసక్తికర విషయాలు

  • October 13, 2023 / 07:44 PM IST

ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 20 న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా రేణు దేశాయ్ పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అవి మీ కోసం :

ప్ర) ఈ మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్టు ఉన్నారు?

రేణు దేశాయ్ : అది ప్లాన్ చేసింది కాదు. అలా జరిగింది అంతే..!

ప్ర) ‘టైగర్ నాగేశ్వరరావు’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

రేణు దేశాయ్ : ఈ చిత్రంలో హేమలతా లవణం అనే పాత్ర చేశాను. నా కెరీర్లో నేను చేసిన గొప్ప పాత్ర ఇది అనిపిస్తుంది. లార్జర్ దేన్ లైఫ్ అనే విధంగా ఈ పాత్ర ఉంటుంది. జోగిని వ్యవస్థపై, అంటరానితనం పై పోరాడే ఓ మహిళ పాత్ర ఇది.ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంది అని నేను భావిస్తున్నాను.

ప్ర) ‘టైగర్ నాగేశ్వరరావు’ గారి రియల్ లైఫ్ గురించి మీరు విన్నారా?

రేణు దేశాయ్ : ఎక్కువగా అయితే వినలేదు. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ బిగ్ మూవీ అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. దర్శకుడు వంశీ ఈ సినిమా తో నేషనల్ లెవల్ కి వెళ్తారు అనే నమ్మకం నాలో బలంగా ఉంది. అభిషేక్ గారి నిర్మాణంలో పని చేయడం, రవితేజ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా నాకు సంతోషంగా అనిపిస్తుంది.

ప్ర) ఈ పాత్ర కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?

రేణు దేశాయ్ : హేమలత గారి గురించి తెలుసుకోవడానికి కొంతమందిని కలవడం జరిగింది. ఆమె మేనకోడలు కీర్తి గారిని విజయవాడలో కలిశాను. ఆవిడ గురించి చాలా బాగా వివరించారు. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ రిఫరెన్స్ లు బాగా హెల్ప్ అయ్యాయి. నిజజీవితంలో నేను మాట్లాడేటప్పుడు నా తల ఎక్కువగా కదిలిస్తాను. కానీ హేమలత లవణం గారు స్థిరంగా హుందాగా ఉంటూ ధైర్యంగా మాట్లాడతారు. అలా స్థిరంగా ఉండే బాడీ లాంగ్వేజ్ కోసం ఎక్కువగా వర్క్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఈ పాత్ర కోసం తెలుగు ఇంకాస్త డెప్త్ గా నేర్చుకోవాల్సి వచ్చింది.

ప్ర) ముందుగా మీరు హీరోయిన్ గా చేశారు, తర్వాత డైరెక్షన్ చేశారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.. ఎలా అనిపించింది?

రేణు దేశాయ్ : డిజైనర్ కంటే ముందు నేను స్టయిలిస్ట్ ని.! డిజైనర్ వర్క్ వేరు. నాకు కలర్స్ పై మంచి అవగాహన ఉంది. నేను ఆర్ట్స్ స్టూడెంట్ ని. ఏ కలర్ ఏది మ్యాచ్ అవుతుందో నాకు అర్థమవుతుంది. నేను స్టయిలిస్ట్ ని మాత్రమే. స్టయిలింగ్ కూడా నేను ప్లాన్ చేసి చేసింది కాదు. ఖుషి సినిమాకి ముందు కళ్యాణ్ గారితో షాపింగ్ కి వెళ్ళినపుడు నా స్టయిలింగ్ సెన్స్ ఆయనకి నచ్చింది. నువ్వే చేసేయ్ అన్నారు. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసి చేసినవి కాదు.

ప్ర) రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

రేణు దేశాయ్ : రవితేజ గారితో పని చేయడం చేయడం అనేది నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఆయన గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరింత చెప్తాను. దీని కోసం ప్రత్యేకంగా ఒక స్పీచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను.(నవ్వుతూ)

ప్ర) నిర్మాత అభిషేక్ అగర్వాల్ గారి గురించి చెప్పండి?

రేణు దేశాయ్ : ఆయనకు మంచి విజన్ ఉంది. ఆయనతో కొత్త డైరెక్టర్లు కనుక పని చేస్తే కనుక.. ఆయన నుండి ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు.

ప్ర) ఇది మీ రీ ఎంట్రీ మూవీ.. ఇక నుండి నటిగా కంటిన్యూ అవుతారా?

రేణు దేశాయ్ :  నాకు కూడా నటించాలానే ఉంది. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను.

ప్ర) ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయంలో మీకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా?

రేణు దేశాయ్ : ట్రైలర్ చూశాక మా అమ్మాయి .. ‘నీ ఏజ్ కి తగ్గ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉంది అమ్మా’ అని చెప్పింది.

ప్ర) అకీరా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు?

రేణు దేశాయ్ : హీరోగా చేయాలని అతనికి లేదు. అతను ఓ యూనిక్ పర్సన్. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి అవగాహన తెచ్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి కూడా రైటింగ్ అంటే ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తిని నేనే..! ఫస్ట్ నేనే అనౌన్స్ చేస్తా.

ప్ర) నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?

రేణు దేశాయ్ : చెప్పాను కదా..! నా  (Renu Desai) ఏజ్ కి తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus