పెళ్లి గోల అనే బయోపిక్ తీసి అందరికీ క్లారిటీ ఇస్తే సరిపోతుంది : రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ తో ఈమె విడిపోయి సుమారు 7 ఏళ్ళు కావస్తుంది. పవన్ తో విడిపోయిన తర్వాత ఈమె కొంత కాలం పూణేలో ఉంటూ వచ్చింది. తరువాత హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. పిల్లలు అకీరా,ఆద్య లు.. ఈమె దగ్గరే ఉంటున్నారు. అయితే ఓసారి ఈమె అనారోగ్యం పాలవ్వడంతో ‘నాకు కూడా ఓ తోడు ఉంటే బాగుణ్ణు కదా’ అని అనిపించిందట.

దాంతో 2018లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మాత్రం రేణు రివీల్ చెయ్యలేదు. ఎంగేజ్మెంట్ అయ్యి రెండేళ్ళు కావస్తున్నా.. ఇంకా ఈమె పెళ్లి కూడా జరగలేదు. ఓ పక్క పవన్ ఫ్యాన్స్.. ‘పెళ్లి చేసుకోవద్దంటూ’ ఈమెకు మెసేజ్‌లు పంపుతూ విసిగిస్తున్నారు. మరోపక్క ఈమె బుల్లితెర పై షోలు చేస్తుంది కాబట్టి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ తో సహా కొందరు నెటిజెన్లు ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.

వాటి పై తాజాగా రేణు స్పందించింది. రేణు మాట్లాడుతూ … “పెళ్లి చేసుకున్నా కష్టమే.. చేసుకోకపోయినా కష్టమే!. అయినా మీరు నా పెళ్లికి వచ్చేది లేదు.. చేసేది లేదు.. ఎందుకింత ఆసక్తి? నేను పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయిన కూడా కొందరకి సమస్యగా ఉన్నట్టు ఉంది. వాళ్ళందరికీ ‘పెళ్లి గోల’ అనే బయోపిక్ తీసి క్లారిటీ ఇస్తే సరిపోతుందేమో.! నా వ్యక్తిగత జీవితం గురించి మీకు ఎందుకు? అసలు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు” అంటూ కామెంట్స్ చేసింది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus